కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి నందమూరి కుటుంబం అంటే ఎంతో అభిమానం. స్వర్గీయ ఎన్టీఆర్ ని ఆయన తన సోదరుడిగానే భావిస్తారు. ఎన్టీఆర్ తో మోహన్ బాబు మేజర్ చంద్రకాంత్ అనే అద్భుతమైన చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా బాలకృష్ణ, హరికృష్ణ లతో కూడా మోహన్ బాబు నటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి యమదొంగ చిత్రంలో నటించారు.