
ఊర్వశి రౌటేలా ఇప్పుడు తెలుగు వారికి సుపరిచితమైన పేరుగా మారిపోయింది. ఆమె గురించి చెప్పాలంటే స్పెషల్ ఇంట్రడక్షన్ అవసవం లేకపోయింది. ఇక్కడ వరస పెట్టి ఐటమ్ సాంగ్స్ చేస్తూండటంతో ఈ బాలీవుడ్ బ్యూటికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇప్పటికే స్టార్ హీరోలతో ఐటమ్ సాంగ్స్ లలో రొమాన్స్ చేసింది.. ఆమెతో చేసిన సాంగ్స్ భారీ హిట్ టాక్ ను అందుకోవటం ప్లస్ అయ్యింది.
వాల్తేరు వీరయ్య చిత్రంలో బాస్ పార్టీ అంటూ ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఇక మొదటి సాంగ్ తో వరుస అవకాశాలు అందుకుంది. వెంటనే ఏజెంట్ సినిమాలో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పవన్ – తేజ్ కాంబోలో వచ్చిన బ్రో సినిమాలో ఐటెం సాంగ్ ఛాన్స్ కొట్టేసిం దుమ్ము దులిపింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బాలయ్య సినిమాలో నటిస్తూ బిజీగా మారింది.
గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు తో కలిసి స్టెప్పులు వేయటం బాగా కలిసి వచ్చింది . ఆ పాట సూపర్ హిట్ అయ్యింది. దాంతో అదే దర్శకుడు బాబి కొల్లి డైరక్షన్ లో పాట కాకుండా పాత్రకు కమిటైంది. ఈక్రమంలో నందమూరి బాలయ్యతో రొమాన్స్ చేయబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ క్రమంలో బాలకృష్ణతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఊర్వశీ రౌటేలా. ఊర్వశి షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ తెరకెక్కుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ మూవీలో యానిమల్ ఫేమ్ బాబీడియోల్ విలన్‌గా నటిస్తోన్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఓ కీలక పాత్ర చేస్తోంది. ఈ మేరకు ఊర్వశి పై సీన్స్ షూట్ జరుగుతున్నాయి. అయితే అనుకోకుండా ఓ యాక్షన్ సీక్వెన్స్ లో ఆమె గాయపడిందని సమాచారం.
ఎక్కువగా తెలుగులో ఐటెంసాంగ్ మాత్రమే చేస్తూ వస్తున్న ఊర్వశి ఈ సారి ఒక కీలక పాత్రలో చూపిస్తున్నారు బాబీ. అయితే, షూటింగ్‌లో ఊర్వశి తీవ్రంగా గాయపడిందని, వెంటనే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఓ సీన్ షూట్ చేసున్న సమయంలో ఊర్వశికి ఫ్రాక్చర్ అయ్యిందని.. అప్పటి నుంచి తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె టీమ్ తెలిపింది.
NBK 109 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటోంది. ఈ మూవీ మూడో షెడ్యూల్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా హైదరాబాద్ వచ్చింది. ఈ చిత్రంలో ఊర్వశీ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ఊర్వశీ తీవ్ర గాయాలపాలైనట్లు తెలుస్తోంది. దాంతో ఆమెను ఆస్పత్రిలో జాయిన్ చేసి.. చికిత్స అందిస్తున్నట్లు టీమ్ తెలిపింది. ఊర్వశీ రౌటేలా ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాలకృష్ణ-బాబీ దర్శకత్వంలో వస్తున్న NBK 109 మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశితో పాటుగా యానిమల్ విలన్ బాబీ డియోలు, చాందిని చౌదరి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. SS థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఎన్‌బీకే 109లో స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశి కోటి వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. హిందీలో ఊర్వశి దిల్ హై గ్రే అనే సినిమా చేస్తోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఊర్వశి నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.