ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను నిర్మించగా.. జె.వి.రాఘవులు సంగీతం అందించారు. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమా.. యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కాని చిరంజీవి అభిమానులను మాత్రం అలరించింది. 8 కేంద్రాలలో 50 రోజులు మరియు రెండు కేంద్రాల్లో 100 రోజుల రన్ సాధించింది.
ఆపై షిఫ్ట్‌లతో ఉదయం ఆటలు ఆడుతూ 517 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇంట్లో భార్య పై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయట అడుగు పెట్టగానే మరో స్త్రీ కోసం వెంపర్లాడే మగాడి జీవితాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు.