ఎన్టీఆర్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌ ఏంటి? చిన్న పిల్లాడిలా ఉన్నాడు, సెట్ కాడన్నారు.. `ఆది` మూవీ వెనుక షాకింగ్‌ స్టోరీ

First Published May 18, 2024, 8:58 AM IST

ఎన్టీఆర్‌ నటించిన `ఆది` సినిమాతోనే దర్శకుడిగా మారారు వివి వినాయక్‌. కానీ ఆ సినిమా సమయంలో తారక్‌ విషయంలో చాలా విమర్శలు వచ్చాయట. షాకిచ్చే నిజాలు బయటపెట్టాడు స్టార్‌ డైరెక్టర్‌. 
 

 జూ ఎన్టీఆర్‌ `స్టూడెంట్‌ నెం 1`తో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే అదరగొట్టాడు. అందరి దృష్టిని ఆకర్షించాడు. కానీ ఎన్టీఆర్‌ ప్రారంభంలో చాలా అవమానాలు ఫేస్‌ చేశాడు. లుక్‌ పరంగా ఆయన విమర్శలు ఎదుర్కొన్నాడు. ముఖ్యం మీద ఎవరు అనలేదుగానీ, ఆ తర్వాత ఒక్కొక్కరుగా బయటపెడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. `స్టూడెండ్‌ నెం1` మూవీ ఎన్టీఆర్‌తో చేయాలనే ప్రపోజల్‌ వచ్చినప్పుడు తారక్‌ని చూసి రాజమౌళి వీడు నా హీరో ఏంటి, ఇంత లావుగా ఉన్నాడని మనసులో అనుకున్నాడట. కానీ ఆ సినిమా చేశాక తన ఆలోచన తప్పు అని భావించినట్టు రాజమౌళి వెల్లడించారు. 

ఇప్పుడు అలాంటి సంఘటనే `ఆది` సినిమా విషయంలో జరిగిందట. ఎన్టీఆర్‌ ప్రారంభంలోనే ఫ్యాక్షన్‌ మూవీస్‌, ఏజ్‌కి మించిన కథలు చేశాడు. `ఆది`, `నాగ`, `సింహాద్రి` చిత్రాలు ఆ కోవకి చెందినవే. `ఆది`లో తారక్‌ ఫ్యాక్షన్‌ లీడర్‌గా కనిపిస్తాడు. తండ్రిపై ఎటాక్‌ చేస్తే కుర్రాడిగా ఉన్న ఎన్టీఆరే రంగంలోకి దిగి ఫ్యాక్షన్‌ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లాడు. తొడగొట్టి మరీ ప్రత్యర్థులకు చుక్కలు చూపించారు. రాయాలసీమ నీళ్లు తాగితే ఆ పౌరుషం వచ్చినట్టుగా, డైలాగ్‌లు, యాక్షన్‌ సీన్లు అదిరిపోయాయి. సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. ఈ సినిమాకి వివి వినాయక్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. 
 

Latest Videos


అయితే ఈ సినిమా చేయాల్సి వచ్చినప్పుడు హీరోగా ఎన్టీఆర్‌ని తీసుకున్నప్పుడు చాలా మంది విమర్శించారట. సెటైర్లు వేశారట. చిన్న పిల్లోడిలా ఉన్నాడు, కనీసం మీసాలు కూడా మొలవలేదు, ఫ్యాక్షన్‌ లీడర్‌గా ఎలా సెట్‌ అవుతాడు. అంత పెద్ద పాత్రని ఎలా చేస్తాడని ప్రశ్నించాడట. ఫ్యాక్షన్‌ లీడర్‌గా సెట్‌ కాడు, రిస్క్ చేయోద్దు అన్నారట. ఆయన్ని వద్దు అని చాలా మంది చెప్పారట. కానీ ఎన్టీఆర్‌పై నమ్మకంతో, తన డైరెక్షన్‌పై నమ్మకంతో తాను చేసినట్టు చెప్పాడు దర్శకుడు వినాయక్‌. కానీ సినిమా చూశాక అందరు ఒప్పుకున్నారట. ఎన్టీఆర్‌ని చూసి కన్విన్స్ అయినట్టు చెప్పారు వినాయక్‌. 
 

ఎన్టీఆర్‌ విషయంలోనే కాదు నితిన్‌ విషయంలోనూ అదే జరిగిందన్నారు. `దిల్‌` సినిమా సమయంలో అలాంటి విమర్శలు వచ్చాయి. అయితే ఆ సినిమాలో నితిన్‌ మామూలు కుర్రాడిలా ఉంటాడు, కానీ కొడితే బిలివిబులిటీ వచ్చింది. జనం యాక్సెప్ట్ చేశారు. దీంతో తనకు తనపై నమ్మకం ఏర్పడిందన్నారు వినాయక్‌. ఓపెన్‌ హార్ట్ విత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు వినాయక్‌. ఆ పాత క్లిప్‌ ఇప్పుడు వైరల్‌గా మారడం విశేషం.

ఎన్టీఆర్‌తో సినిమా కెరీర్‌ని ప్రారంభించాడు వినాయక్‌. ఆయన వరుసగా మూడు సినిమాలు చేశాడు. `ఆది`, `సాంబ`, `అదుర్స్` చిత్రాలు చేశారు. `ఆది` బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌. కానీ `సాంబ` ఆడలేదు. ఆ తర్వాత రూట్‌ మార్చి `అదుర్స్` మూవీ చేశాడు. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్‌ అయ్యింది. 
 

దర్శకుడిగా ఎన్టీఆర్‌ `ఆది`, నితిన్‌ `దిల్‌`, చిరంజీవి `ఠాకూర్‌`, అల్లు అర్జున్‌ `బన్నీ`, వెంకటేష్‌ `లక్ష్మీ`, రవితేజ `కృష్ణ`, తారక్‌ `అదుర్స్`, రామ్‌ చరణ్‌ `నాయక్‌`, చిరుతో `ఖైదీ  నెంబర్‌ 150` చిత్రాలతో విజయాలు అందుకున్నారు. బాలయ్యతో చేసిన `చెన్నకేశవరెడ్డి` యావరేజ్‌గా ఆడింది. `సాంబ`, `యోగి`, `భద్రినాథ్‌`, `అల్లుడు శ్రీను`, `అఖిల్‌`, `ఇంటలిజెంట్‌`, `చత్రపతి` రీమేక్‌ చిత్రాలు బోల్తా కొట్టాయి. ప్రస్తుతం  సినిమాలకు దూరంగా ఉంటున్నారు వినాయక్‌. నటుడిగా `శీనయ్య` మూవీ చేయాలనుకున్నారు. అది ఆదిలోనే ఆగిపోయింది. 
 

click me!