పద్ధతిగా ఇండస్ట్రీలోకి వచ్చి.. సడెన్‌గా గ్లామర్‌ గేట్లు ఎత్తేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా? చూస్తే మైండ్‌ బ్లాకే!

First Published | May 17, 2024, 10:50 PM IST

హీరోయిన్లు మొదట్లో చాలా పద్ధతిగా కనిపించారు. ఫస్ట్ మూవీలో సాంప్రదాయానికి పెద్ద పీఠ వేశారు. అంతే ఆ తర్వాత గ్లామర్‌ గేట్లు ఎత్తేసి రెచ్చిపోతున్నారు. మరి ఆయా అందాల భామలు ఎవరో తెలుసా?
 

సమంత ఈ జాబితాలో ముందే ఉంటుంది. ఆమె 2010లో `ఏం మాయ చేసావె` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో కాలేజీ స్టూడెంట్‌గా, చైతూ ప్రేమలో పడే అమ్మాయిగా కనిపించింది. సినిమా మొత్తంలో ఎక్కడా ఎక్స్ పోజింగ్‌ చేయలేదు సమంత. హోమ్లీ బ్యూటీ గా మెప్పించింది. ఆ తర్వాత క్రమంగా గ్లామర్‌ సైడ్‌ తీసుకుంది. సినిమాల్లో రాణించాలంటే అందాల విందు తప్పదని తెలుసుకున్న ఆమె హాట్‌ షో చేసింది. బికినీలు ప్రదర్శించే స్థాయికి చేరుకుంది.ఇప్పుడు ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్‌ షో చేస్తూ సంచలనంగా మారుతుంది సమంత. 
 

సీనియర్‌ హీరోయిన్లలో కాజల్‌ కూడా ఉంటుంది. ఆమె తొలి చిత్రం `లక్ష్మీ కళ్యాణం` సమయంలో హాఫ్‌ శారీలో పల్లెటూరి అమ్మాయిలా మెరిసింది. నో స్కిన్‌ షో. కానీ ఆ తర్వాత అందాల విందుతో దుమ్ములేపింది. ఓ ఫోటో షూట్‌ న్యూడ్‌గానూ చేసి షాకిచ్చింది. ఇటీవల మ్యారేజ్‌ చేసుకున్న కాజల్‌.. రీఎంట్రీ కోసం డోస్‌ పెంచి షాకిచ్చింది. ఆఫర్ల కోసం స్కిన్‌ షో చేసి దుమారం రేపింది. 
 

Latest Videos


ఇక మరో సీనియర్‌ బ్యూటీ తమన్నా కూడా ఉన్నారు. ఆమె `శ్రీ` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చాలా పద్ధతిగా కనిపించింది. హోమ్లీ బ్యూటీగా మెరిసి అలరించింది. `హ్యాపీడేస్‌` వరకు కాస్త ఫర్వాలేదు. `కాళీదాసు` నుంచి రెచ్చిపోయింది. మిల్కీ అందాలను అప్పనంగా ఆరబోస్తూ ఆఫర్లు అందుకుంది. ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది. ఇటీవల `అరణ్మనై 4`లో నెవర్‌ బిఫోర్‌ అనేలా రెచ్చిపోయింది షాకిచ్చింది తమన్నా. ఇక్కడ సర్వైవ్‌ అవ్వాలంటే అందాల విందు తప్పదని చాటి చెప్పింది. 
 

కీర్తిసురేష్‌ అంటే మన ఇంట్లో అమ్మాయిలా ఉండేది. `నేను శైలజ`లో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించింది. `మహానటి`తో సావిత్రి అంటే ఇలానే ఉంటుందేమో అనేంతగా మెప్పించింది. కానీ `సర్కారు వారి పాట`తో డోస్‌ పెంచింది. ఇటీవల బాలీవుడ్‌కి వెళ్లింది. `బేబీజాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె ఎక్స్ పోజింగ్‌ చేసి షాకిచ్చింది. ఓ పిక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేయడం గమనార్హం. 
 

అలాగే హోమ్లీ బ్యూటీ అనే పదానికి, సాంప్రదాయం అనే పదానికి పర్యాయపదంగా ఉంది అనుపమా పరమేశ్వరన్‌. `ప్రేమమ్‌`లో ఆమె క్యూట్‌గా అలరించింది. మన ఇంట్లో అమ్మాయిలా మెరిసింది. `శతమానం భవతి`లోనూ అంతే ముద్దుగా ఆకట్టుకుంది. కానీ ఇటీవల `టిల్లు స్వ్కేర్‌`తో దుమారం రేపింది. `అనుపమా 2.0` చూపించింది. ఎక్స్ పోజింగ్‌ మాత్రమే కాదు, లిప్‌ లాక్‌లు, బెడ్‌ సీన్లు కూడా చేసి షాకిచ్చింది. ఆఫర్లు రావాలంటే ఎక్కువ కాలం రాణించాలంటే మారాల్సిందే అని నిరూపించింది అనుపమా. 
 

`జాతిరత్నాలు` చిత్రంలో క్యూట్‌గా మెరిసింది ఫరియా అబ్దుల్లా. ఇన్నోసెంట్‌గా కనిపించి ఆకట్టుకుంది. నవ్వులు పూయించింది. ఆ తర్వాత విజృంభించింది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ చూపిస్తూ రాణిస్తుంది. సినిమా ఆఫర్ల కోసం తన వంతు అందాల విందు ప్రయత్నం చేస్తుందీ పొడుగు కాళ్ల సుందరి. 
 

స్టార్‌ హీరోయిన్‌ నుంచి ఒక్క సారిగా డౌన్‌ అయిన పూజా హెగ్డే కూడా `ముకుంద` సినిమాలో పద్ధతిగా మెరిసింది. హాఫ్‌ శారీలో పడుచుపిల్లలా ఆకట్టుకుంది. కానీ `డీజే` నుంచి డోస్‌ పెంచింది. ఇటీవల కాలంలో ఏమాత్రం హద్దుల్లేవని చాటి చెప్పింది. ఆ పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఆఫర్ల కోసం, ఇండస్ట్రీలో సర్వైవ్‌ అవ్వాలంటే ఇవన్నీ కామన్‌ అని చాటి చెబుతూనే ఉంది. 
 

ప్రస్తుతం నేషనల్‌ క్రష్‌గా రాణిస్తుంది రష్మిక మందన్నా. `పుష్ప`, `యానిమల్‌` చిత్రాలతో ఇండియన్‌ సినిమాని షేక్‌ చేసింది. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేసిన `ఛలో` చిత్రంలో కాలేజ్‌ అమ్మాయిలా క్యూట్‌గా కనిపించింది. ఎక్స్ పోజింగ్‌కి ఛాన్సే లేదు. `గీత గోవిందం`, `దేవదాసు`, `డియర్‌ కామ్రేడ్‌` వరకు చాలా పద్ధతిగా కనిపించింది. `సరిలేరు నీకెవ్వరు`తో కాస్త గ్లామర్‌ ట్రీట్‌ ప్రారంభించింది. `పుష్ప`లో రెచ్చిపోయింది. ఇక `యానిమల్‌`లో నెక్ట్స్ లెవల్‌ చూపించింది. ఈవెంట్లలో, సోషల్‌ మీడియాలో ఫోటో షూట్లలో గ్లామర్‌ డోస్‌ పెంచి ఆశ్చర్యపరుస్తుంది. హీరోయిన్‌గా ఎక్కువ కాలం రాణించాలంటే ఇవన్నీ కామన్‌ అని చెబుతుంది రష్మిక. 
 

మరోవైపు హోమ్లీ బ్యూటీ అనే పదానికి కేరాఫ్‌గా నిలిచింది మీరా జాస్మిన్‌. `అమ్మాయి బాగుంది`, `గుడుంబా శంకర్‌` చిత్రాల్లో పద్దతిగా మెరిసింది. ఆ తర్వాత కూడా అదే ట్రెండ్‌ని ఫాలోఅయ్యింది. వెస్ట్రన్‌ డ్రెస్సులు వేసినా ఎక్స్ పోజింగ్‌ చేయలేదు. కానీ ఇటీవల రీఎంట్రీ సమయంలో మాత్రం 2.0 చూపించి షాకిచ్చింది. అవకాశాలు రావాలంటే ఈ మాత్రం చేయాల్సిందే అని నిరూపించింది. ఇప్పుడు ఒకటి అర ఆఫర్లతో సెకండ్‌ ఇన్నింగ్స్ లో రాణిస్తుందీ అందాల భామ. 
 

కృతి శెట్టి కూడా మొదటి సినిమా `ఉప్పెన`లో ట్రెడిషనల్‌గా మెరిసింది. కానీ `ది వారియర్‌` కాస్త గ్లామర్‌ షో చేసింది. సోషల్‌ మీడియాలో ఆ డోస్‌ మరింతగా పెంచుతుంది. ఆఫర్లు కోసం అందాల ఎరవేస్తుంది. ఇలా చాలా మంది యంగ్‌ హీరోయిన్లు కూడా ఇదే తంతు కొనసాగిస్తున్నారు.

click me!