నెమలి పురివిప్పినట్టుగా `కేన్స్` రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్‌ హోయలు.. చేతి గాయంతోనూ సాహసం..

Published : May 18, 2024, 07:19 AM IST

మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ మరోసారి కేన్స్ రెడ్ కార్పెట్‌పై మెరిసింది. ఆమె గాయంతోనూ రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోవడం విశేషం.   

PREV
17
నెమలి పురివిప్పినట్టుగా `కేన్స్` రెడ్‌ కార్పెట్‌పై ఐశ్వర్య రాయ్‌ హోయలు.. చేతి గాయంతోనూ సాహసం..

ప్రపంచ మాజీ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌.. కేన్స్ వేడుకలో మరోసారి మెరిసింది. ఆమె పర్మినెంట్‌ కేన్స్ మెంబర్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. 2002 నుంచి ఆమె రెగ్యూలర్ గా ఈ కేన్స్ వేడుకలో సందడి చేస్తూనే ఉంది. తీరైన దుస్తులు ధరించిహోయలు పోతుంది. 
 

27

తాజాగా కేన్స్ 20024లోనూ ఐశ్వర్య రాయ్‌ సందడి చేసింది. పారిస్‌ వేదికగా జరిగేఈ వేడుకలో అవార్డులకంటే రెడ్‌ కార్పెట్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉంటుంది. అందుకే ప్రపంచంలోని హీరోయిన్లంతా చాలా వరకు ఇందులో పాల్గొంటారు. మన ఇండియా నుంచి చాలా మంది భామలు సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 
 

37

ఐశ్వర్య రాయ్‌, కత్రినాకైఫ్‌, దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌, సోనమ్‌ కపూర్‌ వంటి భామలు సందడి చేశారు. మన సౌత్‌ బ్యూటీస్‌లో పూజా హెగ్డే, తమన్నా వంటి వారు కూడా మెరవడం విశేషం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఐష్‌ గురువారం నుంచి మెరుస్తుంది. ఆమె ఈ సారి రెండు సార్టు రెడ్‌ కార్పెట్‌పై హోయలు పోయింది. 
 

47

నెమలి పురివిప్పినట్టుగా ఉన్న వెరైటీ డిజైనింగ్‌ వేర్‌లో ఐశ్వర్యా రాయ్‌ కనువిందు చేసింది. పికాక్‌ నడిచి వస్తుందా అనేట్టుగా ఆమె రెడ్‌ కార్పెట్‌ పై వాక్‌ చేయడం విశేషం. ఆమె నడుచుకుంటూ వస్తుంటే కెమెరామెన్లు ఆమెని కెమెరాల్లో బంధించేందుకుపోటీ పడ్డారు. 
 

57

అదే సమయంలో కేన్స్ వేడుకలో ఈ సారి ప్రత్యేకంగా నిలిచింది ఐశ్వర్యా రాయ్‌. ఆమె తన కూతురుతో కలిసి ఇందులో పాల్గొంది. ఐష్‌ రెండు సార్లు మెరవడం ఓ విశేషమైతే, తన కూతురు సపోర్ట్ తో ఆమె వాక్‌ చేస్తూ కనిపించడం మరో విశేషం. కూతురు ఆద్య కూడా హీరోయిన్‌లా కనిపిస్తుండటం విశేషం. 
 

67

ఇక ఐశ్వర్యా రాయ్‌ చేతికి గాయమైంది. కుడి చేతికి కట్టుతో కనిపించింది. గాయంలోనూ చేయి కదపని స్థితిలోనూ ఆమె బ్యాండేజ్‌ వేసుకుని కేన్స్ లో ఇంతటి భారీ డిజైనింగ్‌ డ్రెస్‌ని ధరించి వాక్‌ చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. విశ్వసుందరి డెడికేషన్‌కి అంతా వాహ్‌ అనాల్సిందే. 
 

77

మాజీ విశ్వసుందరి అయిన ఐశ్వర్య రాయ్‌.. దాదాపు 22 ఏళ్లుగా కేన్స్ లో మెరుస్తూ భారతీయతని చాటి చెబుతుంది. ఆమె ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఈ సారి కాస్త బొద్దుగా కనిపించింది. గాయం కారణంగా ఆమె వెయిట్‌ పెరిగినట్టు తెలుస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories