ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం. అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. స్టార్ హీరోల దగ్గరకు చాలా కథలు వస్తుంటాయి. అందులో కొన్ని నచ్చక వారు వదిలేస్తుంటారు. కానీ అవే కథలతో ఇతర హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈక్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్ లో 8బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల కథలను వదిలేసుకున్నారట ఇంతకీ ఏంటా సినిమాలు
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ కు చాలాప్రత్యేకం. ఆయన నటన, డాన్స్ చాలా డిఫరెంట్. ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంతో తారక్ తరువాతే ఎవరైనా. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న తారక్, వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఇక రీసెంట్ గా దేవర సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకున్న ఎన్టీఆర్, త్వరలో బాలీవుడ్ మూవీ వార్ 2 తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
టాలీవుడ్ తో పాటు పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్, కొన్ని హిట్ సినిమాలను మిస్ అయ్యాడని మీకు తెలుసా? అంతే కాదు ఎన్టీఆర్ వద్దనుకున్న కథలతో సినిమాలు చేసి కొంత మంది హీరోలు సూపర్ హిట్ కొట్టారని తెలుసా? తారక్‌కి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. తారక్ వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి?
ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ కిక్ సినిమాదే. రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్‌గా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కిక్'. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే మొదట ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేయబడిందట. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం. అంతే కాదు రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళిందట. కాని తారక్ ఆ సినిమాన చేయలేదు.
అంతే కాదు ఆర్య సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ నే హీరోగా అనుకున్నారట. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్టైనర్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే సుకుమార్ కెరీర్ బిగినింగ్ అవ్వడం, రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో.. కథ నచ్చినా కూడా తారక్ ఈసినిమా చేయలేకపోయాడు. ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్‌ని రిజెక్ట్ చేశాడన్నది ఇండస్ట్రీ టాక్. దాంతో అల్లు అర్జున్ దైర్యం చేసి సుకుమార్ కు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ నే కీలక మలుపు తిప్పింది.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న మరో సినిమా పటాస్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఊపిరి పోసింది. కామెడీ,యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడట అనిల్. కాని ఈ కథ తను చేయనని.. కళ్యాణ్ రామ్ దగ్గరకు పంపించాడట తారక్.
కానీ పటాస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఇక ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా కూడా కళ్యాణ్ రామ్ చేవారు. ఆసినిమా మరేదో కాదు అతనొక్కడే. ఈసినిమా కథ కూడా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తే.. కళ్యాణ్ రామ్ కు బాగుంటుందని అన్నకు పంపించాడట.
అంతేకాకుండా ఎన్టీఆర్ వదులుకున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించి ఎవడు కూడా ఉంది. ఈసినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ముందుగా ఎన్టీఆర్ ను తీసుకోవాలని అడిగారట. కాని అది గెస్ట్ రోల్ కావడం, ఫుల్ లెన్త్ మల్టీ స్టారర్ కాకపోవడంతో తారక్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ టాక్
ఇక నితిన్ తో పాటు నిర్మాత దిల్ రాజుకు కూడా లైఫ్ ఇచ్చిన సినిమా దిల్. ఈసినిమాతోనే ప్రొడ్యూసర్ రాజు కాస్తా దిల్ రాజు అయ్యాడు. ఇక ఈహిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. ఆ కథ తనకు సూట్ అవ్వదని తారక్ వదిలేసుకున్నాడట.
ఇక నాగార్జున - కార్తీ కాంబినేషన్ మూవీ 'ఊపిరి'లో కూడా ఎన్టీఆర్ ను తీసుకోవాలని ట్రై చేశారట. కాని ఆ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ కాదని ఆయన రిజెక్ట్ చేశారని సమాచారం.
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భద్ర లాంటి మాస్ యాక్షన్ మూవీ కూడా ఉంది. ఈసినిమాలో యాక్షన్స్ సీన్స్ ఎక్కవగా ఉండటంతో.. ఎన్టీఆర్ వదిలేశారని సమాచారం. ఇలా తారక్ దగ్గరకు వచ్చి రిజక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆడియన్స్ ను అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి.