Jr NTR: కొమరం భీమ్ రెబల్ లీడర్, మరి ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై తారక్ ఊహించని కామెంట్స్

Published : Apr 01, 2022, 09:50 AM ISTUpdated : Apr 01, 2022, 09:54 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించగా.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు.

PREV
16
Jr NTR: కొమరం భీమ్ రెబల్ లీడర్, మరి ఎన్టీఆర్.. పొలిటికల్ ఎంట్రీపై తారక్ ఊహించని కామెంట్స్
Jr NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీం పాత్రలో నటించగా.. రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరి నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన కంటతడి పెట్టించే విధంగా ఉంది. 

26
Jr NTR

ఆర్ఆర్ఆర్ చిత్రం వందల కోట్లు బాక్సాఫీస్ వద్ద కొల్లగొడుతున్న తరుణంలో ఎన్టీఆర్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా.. టిడిపికి భవిష్యత్తు నాయకుడిగా తారక్ పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు అనే చర్చ చాలా కాలంగా జరుగుతూనే ఉంది. కానీ ఎన్టీఆర్ మాత్రం సినిమాలతో బిజీగా ఉంటూ రాజకీయాలని పట్టించుకోవడం లేదు. 

36
Jr NTR

గతంలో ఒకసారి టిడిపి తరుపున ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ క్యాంపైన్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ తన ప్రసంగాలతో అలరించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ పాలిటిక్స్ ని పట్టించుకోవడం మానేసి నటనపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఇంటర్వ్యూలో తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రస్తావన వచ్చింది. 

46
Jr NTR

ఇంటర్వ్యూలో యాంకర్ మాట్లాడుతూ.. మీరు ఆర్ఆర్ఆర్ లో కొమరం భీం పాత్రలో నటించారు. కొమరం భీమ్ సోషల్ రిఫార్మర్ మాత్రమే కాదు రెబల్ లీడర్ కూడా. తన ప్రజల కోసం ఏమైనా చేసేందుకు కొమరం భీమ్ సిద్ధపడ్డారు. ఆ కోణంలో చూసుకుంటే మీరు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారా ? అని ఎన్టీఆర్ ని ప్రశ్నించారు. 

56
Jr NTR

దీనికి ఎన్టీఆర్ సమాధానం ఇస్తూ.. నేను ఇప్పుడు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన దశలో ఉన్నాను. నటనని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. నేను దానికే కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను. భవిష్యత్తు అంటే నా దృష్టిలో 5 సంవత్సరాల తర్వాతో, 10 సంవత్సరాల తర్వాతో కాదు. నెక్స్ట్ సెకండ్ మాత్రమే మన భవిష్యత్తు అని ఎన్టీఆర్ అన్నారు. ఇప్పటికి తన దృష్టి మొత్తం నటనపైనే అని ఎన్టీఆర్ అన్నారు. 

66
Jr NTR

ఎన్టీఆర్ త్వరగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న అభిమానులకు ఇది కొంత నిరాశకు గురి చేసే అంశమే. టిడిపిలో చాలా మంది నాయకులు, అభిమానులు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అని చెప్పడం లో సందేహం లేదు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ దర్శకత్వంలో నటించాల్సి ఉంది. 

click me!

Recommended Stories