Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ రక్త సంబంధం యొక్క గొప్పతనం అనే నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
రిషి ను జగతి (Jagathi) రెండో డైరెక్టర్ గా ఎంచుకున్నందుకు దేవయాని జీర్ణించుకోలేక ఏడుస్తుంది. ఇక రిషి (Rishi).. పెద్దమ్మ మీ పెంపకంలో ఎలాంటి లోపం లేదు. కేవలం మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు కోసం మాత్రమే ఆమెను రెండో డైరెక్టర్ గా ఎంచుకున్నాను.
27
నాలో మీ స్థానం ఎప్పటికీ అలానే ఉంటుంది అని అన్నట్లు చెబుతాడు. ఇక ఈ క్రమంలో రిషి (Rishi) వాళ్ల పెదనాన్న నువ్వు ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు విషయంలో చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావని రిషిని మెచ్చుకుంటాడు. అంతేకాకుండా మా నాన్న గారి పేరు ప్రతిష్టలు వందేళ్లు చెప్పుకునేలా రిషి కాలేజీను ముందుకు తీసుకుని వెళుతున్నాడు అని దేవాయని (Devayani) తో అంటాడు.
37
మరోవైపు గౌతమ్ (Goutham), వసులు రిషి గెలిచినందుకు ఆనందంగా సెలబ్రేషన్స్ ఏర్పాటు చేద్దామని అనుకుంటారు. ఇక వసు గౌతమ్ చేతిలో ఒక చాక్లెట్ పెడుతుంది. దానితో రిషి పార్టీ అంటే ఇదేనా అని అప్ సెట్ అవుతాడు.
47
ఇక రిషి (Rishi) దగ్గరకు వసు రాగ ప్రాజెక్టు మీద నాకేం కోపం లేదు అందరికీ ఉపయోగపడే ప్రాజెక్టుని రద్దు చేస్తే నాకేమొస్తుంది అని అంటాడు రిషి. ఇక దాంతో వసు (Vasu) మీ గొప్పతనం ఏంటో ఇప్పుడు తెలిసింది కదా సార్ అని అపోలజిస్ చెప్పినట్లు మాట్లాడుతుంది.
57
రిషి అక్కడి నుంచి వెళుతూ ఉండగా వసు చెయ్యి పట్టుకుంటుంది. ఈరోజు మీరు నాతో పాటు రావాల్సిందే అని ఒక చోటికి తీసుకు వెళుతుంది. మరోవైపు జగతి (Jagathi).. రిషి ఈ ప్రాజెక్టు విషయంలో నిరుత్సాహం చెందినందుకు బాధ పడుతూ ఉంటుంది.
67
ఇక వసు (Vasu) రిషి ను ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఒక విజిల్ వేస్తుంది. దాంతో అక్కడకు చాలామంది డ్రమ్స్ పట్టుకొని, రంగులు తీసుకొని వస్తారు. అందరూ ఆనందంగా రంగులు పూసుకుంటారు. ఈ క్రమంలో రిషి (Rishi) వసు లు జంట పక్షులు గా ఒకరికొకరు రంగులు పోసుకుంటారు.
77
ఆ తర్వాత రిషి (Rishi) వసులు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఆ క్రమంలో వసు మీతో హోలీ ఆడినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది సార్ అని చెబుతుంది. ఈ క్రమంలో ఆనందంగా ఒక సెల్ఫీ తీసుకుందాం అని సెల్ఫీ కూడా తీసుకుంటారు. ఇక రంగులతో ఇంటికి వెళ్లిన రిషి ను చూసి దేవయాని (Devayani) ముఖం మాడిపోతుంది.