సినిమా చూడటానికి ఇండియా వచ్చిన అభిమాని
ఇటీవల ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రిసో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ధరించిన టీ-షర్ట్‌పై ఎన్టీఆర్ ఫొటో ముద్రించబడింది. విమానాశ్రయంలో పలువురు ఆమెను పలకరించగా, తాను ఎన్టీఆర్‌కు వీరాభిమానినని, ప్రత్యేకంగా 'వార్-2' సినిమా థియేటర్లోనే చూడాలని భారత్‌కు వచ్చానని వెల్లడించింది.క్రిసో తెలిపిన ప్రకారం, ఇది ఆమెకు తొలిసారి కాదు. గతంలో కూడా ఎన్టీఆర్ సినిమాల కోసం ఇండియాకు వచ్చానని పేర్కొంది. తారక్ సినిమాలన్నింటిని ప్రేమతో చూస్తానని, ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాకు కూడా తప్పకుండా భారత్‌కు వస్తానని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.