నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి లీకులు వస్తూనే ఉన్నాయి. కానీ మోక్షజ్ఞ తొలి చిత్రం అనౌన్స్ మెంట్స్ ఇంత వరకు జరగలేదు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఆ చిత్రం అటకెక్కినట్లు ఆ తర్వాత ప్రచారం జరిగింది. మళ్ళీ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఎలాంటి అప్డేట్ లేదు.
DID YOU KNOW ?
ఆగిపోయిన ప్రశాంత్ వర్మ, మోక్షజ్ఞ మూవీ
నందమూరి మోక్షజ్ఞ తొలి చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం రద్దయినట్లు తెలుస్తోంది.
25
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ వైరల్
ఇటీవల మోక్షజ్ఞ స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపించిన లుక్ ఒకటి బయటకి వచ్చింది. ఫ్యామిలీ వెడ్డింగ్ లో మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ తో అదరగొట్టాడు. దీనితో మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చర్చ మొదలైంది. నందమూరి వంశం అంటే పౌరాణిక, జానపద చిత్రాలకు పెట్టింది పేరు. స్వర్గీయ ఎన్టీఆర్, ఆ తర్వాత బాలయ్య అనేక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించారు. బాలకృష్ణ సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి చిత్రాలలో మాస్ లో చెరగని ముద్ర వేశారు.
35
మోక్షజ్ఞపై ఫ్యాన్స్ లో అంచనాలు
మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తే పౌరాణికం, జానపదం, లేదా మాస్ జోనర్లకు సంబంధించిన చిత్రం చేయాలని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆదిత్య 369 మూవీ సీక్వెల్ తో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తారని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కానీ తాజాగా హీరో నారా రోహిత్ సుందరకాండ మూవీ ప్రమోషన్స్ లో షాకింగ్ కామెంట్స్ చేశారు.
మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సినీ ఎంట్రీ కోసమే అని నారా రోహిత్ కంఫర్మ్ చేశారు. మోక్షజ్ఞ ఎంట్రీ ఎందుకు ఆలస్యం అవుతోంది అనే ప్రశ్నకు నారా రోహిత్ బదులిచ్చారు. మోక్షజ్ఞని రీసెంట్ గా నేను మీట్ అయ్యాను. అతడి బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. మోక్షజ్ఞ నాకు చెప్పిన విషయం ఏంటంటే.. ప్రస్తుతం తాను కథలు వింటున్నానని, మంచి లవ్ స్టోరీ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపాడు.
55
నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
మోక్షజ్ఞకి లవ్ స్టోరీ చిత్రంతో ఎంట్రీ ఇవ్వాలని కోరిక ఉంది. అందుకే వరుసగా ప్రేమ కథలు వింటున్నాడు. నచ్చిన కథ దొరికినప్పుడు సినిమా ప్రారంభం అవుతుంది అని నారా రోహిత్ తెలిపారు. నారా రోహిత్ లీక్ చేసిన మ్యాటర్ నందమూరి ఫ్యాన్స్ కి షాకింగ్ గా ఉంది. మోక్షజ్ఞ మాస్ లేదా ఫాంటసీ కథతో ఎంట్రీ ఇస్తాడు అనుకుంటే లవ్ స్టోరీ కోసం ప్రయత్నిస్తున్నాడా అని నందమూరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.