అది నా స్వభావం కాదు, నేనలా చేయలేను.. భయపడి డైరెక్టర్ కి చెప్పిన జూ.ఎన్టీఆర్, చివరికి ఏమైందంటే

First Published May 25, 2024, 8:20 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మెమొరబుల్ మూవీస్ ఉన్నాయి. కొన్ని చిత్రాలు ఎన్టీఆర్ ఎనేర్జిని బయట పెడితే మరికొన్ని చిత్రాలు తారక్ లోని యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీశాయి. హీరోగా నటిస్తున్న వ్యక్తి నెగిటివ్ షేడ్స్ లోకి మారి మెప్పించడం అంత సులువైన అంశం కాదు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో మెమొరబుల్ మూవీస్ ఉన్నాయి. కొన్ని చిత్రాలు ఎన్టీఆర్ ఎనేర్జిని బయట పెడితే మరికొన్ని చిత్రాలు తారక్ లోని యాక్టింగ్ స్కిల్స్ ని బయటకు తీశాయి. హీరోగా నటిస్తున్న వ్యక్తి నెగిటివ్ షేడ్స్ లోకి మారి మెప్పించడం అంత సులువైన అంశం కాదు. కానీ ఎన్టీఆర్ టెంపర్, జై లవకుశ లాంటి చిత్రాల్లో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ లో అద్భుతంగా నటించారు. 

పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కింది. వక్కంతం వంశీ కథ అందించారు. మహా క్రూరంగా, అవినీతి పరుడిగా ఉండే పోలీస్ అధికారి చివరికి మంచివాడిగా ఎలా మారాడు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు గతంలో పూరి జగన్నాధ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆంధ్రావాలా లాంటి డిజాస్టర్ సినిమా వచ్చింది. 

ఎప్పటికైనా తారక్ కి మంచి హిట్ ఇవ్వాలని పూరి జగన్నాధ్ ఎదురుచూస్తున్న టైంలో వక్కంతం వంశి చెప్పిన కథ చాలా బాగా నచ్చేసింది అట. దీనితో టెంపర్ చిత్రం పట్టాలెక్కింది. నా పేరు దయ నాకు లేనిదే అది అంటూ ఎన్టీఆర్ ఈ చిత్రంలో డైలాగ్ చెబుతాడు. క్యారెక్టర్ కి తగ్గట్లుగా జాలి దయ లేనివాడిగా నటించాలి. 

కానీ అలా క్రూరంగా నటించడం ఎన్టీఆర్ వల్ల కాలేదట. ముఖ్యంగా తనికెళ్ళ భరణితో వచ్చే సన్నివేశాల్లో నేను నటించలేను అని ఎన్టీఆర్ పూరి జగన్నాధ్ కి చెప్పేశారట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. పూరి భయ్యా నా స్వభావం ఇది కాదు. ఇలాంటి సీన్లు నేను చేయలేను అని చెప్పాడట. 

దీనితో పూరి జగన్నాధ్ ప్రతి రోజు ఎన్టీఆర్ ని మోటివేట్ చేశారట. మన సినిమాని నమ్మండి. ఒక మనిషి రాక్షసుడిగా ఉంటూ మహనీయుడుగా ఎలా మారాడు అనే కథని మనం చెబుతున్నాం అని పూరి జగన్నాధ్ తారక్ ని మోటివేట్ చేశారట. 

మీరు ఎంత క్రూరంగా ఉంటే అంత మహానుభావుడిగా ఎలివేట్ అవుతారు. దానిని మీరు నమ్మాలి అని పూరి ఎన్టీఆర్ కి చెప్పారట. పూరి జగన్నాధ్ గారు, ఇతర టీం ఈ కథని ఇంతగా నమ్ముకుంటే ఈ మూవీకి నాకు ఇంత మంచి పేరు వచ్చేది కాదు అని తారక్ అన్నారు. ఒక దశలో ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాను ఏంటి.. ఆడియన్స్ నన్ను కొడతారా అని తారక్ సరదాగా కూడా అన్నారు. 

Latest Videos

click me!