అనిల్ రావిపూడి వివాదాన్ని కెలికిన హైపర్ ఆది, ఇలా తగులుకున్నాడేంటి.. చిరాకుతో డైరెక్టర్ వార్నింగ్

First Published May 25, 2024, 6:58 AM IST

డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. తన కథలకి ఎంటర్టైన్మెంట్ జోడించి హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడి స్టైల్. ఇటీవల అనిల్ రావిపూడి ఐపీఎల్ పై చేసిన వ్యాఖ్యలు ఎలా బూమరాంగ్ అయ్యాయో తెలిసిందే.

డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. తన కథలకి ఎంటర్టైన్మెంట్ జోడించి హిట్స్ కొట్టడం అనిల్ రావిపూడి స్టైల్. ఇటీవల అనిల్ రావిపూడి ఐపీఎల్ పై చేసిన వ్యాఖ్యలు ఎలా బూమరాంగ్ అయ్యాయో తెలిసిందే. సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ పై పెద్దఎత్తున ట్రోలింగ్ జరిగింది. 

ఆ తర్వాత తన కామెంట్స్ కి హైపర్ ఆది వివరణ ఇచ్చుకున్నారు కూడా.  ఐపీఎల్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. సాయంత్రం వచ్చి థియేటర్స్ లో సినిమా చూడండి. ఫోన్ లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అన్నారు. దీనితో అనిల్ రావిపూడిపై నెటిజన్లు రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. ఐపీఎల్ చూడకపోతే కొంపలు ముంగిపోవు అని అనిల్ అంటున్నారు.. మరి సినిమాలు చూడకపోతే కొంపలు మునిగిపోతాయా అని ప్రశ్నిస్తూ ట్రోలింగ్ చేసారు. 

ఆ తర్వాత అనిల్ రావిపూడి వివరణ ఇవ్వడం.. తాను కూడా ఐపీఎల్ చూస్తానని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా అనిల్ రావిపూడి ఢీ షో గ్రాండ్ ఫినాలేకి అతిథిగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. అనిల్ రావిపూడి హీరోలా వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు. అనిల్ ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది సెటైర్లు మొదలయ్యాయి. 

ఏంటి రెండు సింహాల మధ్యలోనుంచి ఎంట్రీ ఇచ్చారు ? ఆ సింహానికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ హైపర్ ఆది అనిల్ రావిపూడిని భయపెట్టాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి.. కంటెస్టెంట్స్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ని ఎంజాయ్ చేశారు. 

విన్నర్ ని అనౌన్స్ చేసే సమయంలో హైపర్ ఆది అనిల్ రావిపూడిని చిరాకు పెట్టారు. అన్నా ఒక్కసారి మియావ్ మియావ్ పిల్లి డైలాగ్ చెప్పారా అని అడిగాడు. మైక్ మడత పెట్టి.. అంటూ అనిల్ రావిపూడి ఫన్నీగా హైపర్ ఆదికి వార్నింగ్ ఇచ్చాడు. 

ఇక చివర్లో హైపర్ ఆది.. ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునగవు అంటూ అనిల్ రావిపూడి మాటలు మొదలు పెట్టాడు. వెంటనే అనిల్ రావిపూడి అహే ఆపు.. అని చిరాకు పడ్డారు. అంటే మిమ్మల్ని కవర్ చేయడానికే చెబుతున్నా అని హైపర్ ఆది అంటే.. అవసరం లేదు నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నా. బ్యాటింగ్ మామూలుగా లేదక్కడ. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా.. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు అంటూ అనిల్ రావిపూడి నవ్వులు పూయించారు. ఈ ఎపిసోడ్ మే 29న టెలికాస్ట్ కానుంది. 

Latest Videos

click me!