Latest Videos

రష్మికి పోటీగా సుడిగాలి సుధీర్‌ కొత్త షో.. ఆంటీలతో కొత్త వేశాలు.. ఇంత ఎమోషనల్‌గా మార్చారేంటి?

First Published May 24, 2024, 10:27 PM IST

సుడిగాలి సుధీర్‌.. కొత్త షోతో బుల్లితెరపైకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఆంటీలతో అదరగొడుతున్నాడు. అయితే తన బుల్లితెర లవర్‌ రష్మికి పోటీగా రాబోతుండటం విశేషం. 
 

సుడిగాలి సుధీర్‌,  యాంకర్‌ రష్మి కలిసి ఒకప్పుడు షోలు చేశారు. `జబర్దస్త్` కామెడీ షో, ఢీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలు చేశారు. కానీ సడెన్‌గా విడిపోయారు. కొంత గ్యాప్‌తో ఇప్పుడు మళ్లీ బుల్లితెరపైకి వచ్చాడు సుధీర్‌. అంతేకాదు ఇప్పటి వరకు రష్మి గౌతమ్‌తో కలిసి షో చేసిన సుధీర్‌ ఇప్పుడు ఆమెకి పోటీగా దిగడం ఆశ్చర్యంగా మారింది. 
 

సుడిగాలి సుధీర్‌ సినిమాల కోసం బుల్లితెరని వదిలేశాడు. హీరోగా సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలను వదిలేశాడు. ఏడాదిపాటు అక్కడ బిజీగా ఉన్నాడు. కానీ సినిమాల్లో బ్రేకులు పడ్డాయి. సినిమా రిలీజ్‌లు ఆగిపోయాయి. కొత్త సినిమాలు పట్టాలెక్కడం లేదు. దీంతో సుధీర్‌కి గ్యాప్‌ వచ్చింది. వెంటనే మళ్లీ బుల్లితెర బాట పట్టాడు. మళ్లీ ఈటీవీలోనే కొత్త సో చేస్తున్నాడు. 
 

ఫ్యామిలీ స్టార్స్ పేరుతో ఈ కొత్త షోని తీసుకొస్తున్నారు. ఇటీవల సుధీర్‌ రీఎంట్రీ  ప్రోమో విడుదల చేయగా, ఇప్పుడు `ఫ్యామిలీస్టార్స్` షో ప్రోమోని విడుదల చేశారు. ఇందులో గతంలో పాపలర్‌గా రాణించి, బుల్లితెర స్టార్స్ గా రాణించిన నటీనటులు  ఉండటం విశేషం. అత్తా పాత్రలు,  కోడలు పాత్రలు చేస్తున్న వారంతా ఇందులో పాల్గొన్నారు. ఇక ఇందులో అంటీలతో సుధీర్‌ చేసిన రచ్చ  నెక్ట్స్ లెవల్‌ అని చెప్పొచ్చు. వాళ్ల కామెంట్లకి సుధీర్‌కి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది. 
 

ఇక కోడళ్లు తక్కువ కాదు. వారిని మించిపోయారు. బాగా రాటుదేలారు అనేలా  డబుల్‌ మీనింగ్‌  డైలాగ్‌లతో రెచ్చిపోయారు. సుధీర్‌ అంటేనే డబుల్‌ మీనింగ్‌ డైలాగులు. ఆయనకే ఝలక్‌ ఇచ్చేలా  ఆర్టిస్టులు పంచ్‌లు వేయడం విశేషం. ఇవన్నీ నవ్వులు  పూయించాయి. ఇందులో గెస్ట్ లను రెండుగా  విడగొట్టి వారితో గేమ్స్, క్విజ్‌, ఇలా ఎంటర్‌టైన్‌మెంట్స్ కార్యక్రమాలు నిర్వహించారు సుధీర్‌. 
 

అనంతరం షో మొత్తం ఎమోషనల్‌ సైడ్‌ వెళ్లింది. ఒకప్పుడు స్టార్స్ గా రాణించిన  ఆర్టిస్టులు  ఇప్పుడు సీరియల్స్  కూడా దూరంగా ఉంటున్నారు. కొత్త వాళ్లు రావడంతో వీరికి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో చాలా రోజుల తర్వాత మళ్లీ ఈటీవీ షోకనిపిస్తున్నామని, చాలా గ్యాప్‌తో బుల్లితెరపై మెరుస్తున్నామని చెబుతూ ఎమోషనల్‌ అయ్యారు. తమ ఫ్యామిలీలో `ఫ్యామిలీ స్టార్స్`కి సంబంధించిన  విషయాలు, గ్యాప్‌ రావడానికి కారణాలను వెల్లడిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీంతో షో మొత్తం ఎమోషనల్‌గా మారిపోయింది. ప్రారంభంలో ఫన్‌గా తర్వాత ఎమోషనల్‌గా షో సాగుతుందని ప్రోమో తెలియజేస్తుంది. 

ఇక ఈటీవీలో ఆదివారం రాత్రి 7.30కి ఈ `ఫ్యామిలీస్టార్స్`  షో టెలికాస్ట్ అవుతుందట. జూన్‌ 2 నుంచి ఈ షో ప్రారంభవుతుందని తెలిపారు. సుధీర్‌ మళ్లీ బ్యాక్‌ అవుతుండటంతో ఆయన  అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం  ఈ ప్రోమో వైరల్‌ అవుతుంది. 
 

ఇదిలా ఉంటే చూడబోతుంటే ఇది రష్మికి పోటీగా మారుతుందని అర్థమవుతుంది. రష్మికి పోటీగా సుధీర్‌ రాబోతున్నారని తెలుస్తుంది. ఈటీవీలో జబర్దస్త్ తోపాటు శ్రీదేవి డ్రామా  కంపెనీ కి రష్మి హోస్ట్ గా ఉంది. ఇప్పుడు  ప్రారంభించిన సుధీర్‌  షో కూడా  కొంత పార్ట్ రష్మి `శ్రీదేవి  డ్రామా  కంపెనీ`కి దగ్గరగా ఉంది. ఇలా ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొనబోతుంది. టీఆర్‌పీ రేటింగ్‌ కి సంబంధించిన ఇద్దరు పోటీ పడబోతున్నారు. రష్మి,  సుధీర్‌లో ఎవరు బాగా చేస్తారనేది కూడా  ఇప్పుడు  ఆసక్తికరంగా మారింది. 

click me!