'దేవర' థియేటర్ లో కాలి బూడిదైపోయిన ఎన్టీఆర్ భారీ కటౌట్.. కడపలో మరో తీవ్ర విషాదం

First Published | Sep 27, 2024, 1:37 PM IST

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దేవర చిత్రం సందడి షురూ అయింది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న దేవర చిత్రం సందడి షురూ అయింది. పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా కొరటాల శివ కొన్ని అద్భుతమైన సీన్లు పెట్టారు. దీనికి తోడు ఎన్టీఆర్ నటనతో అదరగొట్టడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

అయితే సెకండ్ హాఫ్ విషయంలో కొంత మిక్స్డ్ టాక్ వస్తోంది. ఏది ఏమైనా ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో చిత్రం ఇది. ఊహించినట్లుగానే థియేటర్స్ లో హంగామా మామూలుగా లేదు. కొన్ని చోట్ల ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 

Also Read: పూరి జగన్నాధ్ సినిమాల్లో సుకుమార్ కి నచ్చిన మూవీ ఏదో తెలుసా..పుష్ప చిత్రానికి ఆ క్యారెక్టరే స్ఫూర్తి ?


హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ వద్ద ప్రమాదకర సంఘటన చోటు చేసుకుంది. థియేటర్ ముందు ఏర్పాటు చేసిన భారీ ఎన్టీఆర్ కటౌట్ దగ్ధమైంది. అగ్ని ప్రమాదం సంభవించడంతో ఎన్టీఆర్ కటౌట్ పూర్తిగా కాలిపోయింది. అభిమానులు అత్యుత్సాహంతో బాణా సంచా విపరీతంగా కాల్చారు. దీనితో నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించాయి. దీనితో కటౌట్ పూర్తిగా కాలిపోయింది. 

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదే విధంగా కడపలో కూడా ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. దేవర రిలీజ్ సందర్భంగా కడపలో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. అప్సర థియేటర్ లో షో జరుగుతోంది. చిత్రం చూడడానికి వచ్చిన మస్తాన్ వలి అనే వ్యక్తి అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. 

ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. వైద్యులు మరణించినట్లు తెలుపడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ విధంగా అక్కడక్కడా దేవర చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్స్ లో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి.  

Latest Videos

click me!