సేఫ్ గేమ్ అంటూ జూ.ఎన్టీఆర్ పై ట్రోలింగ్.. ముక్కుసూటిగా పాయింట్ చెప్పిన కళ్యాణ్ రామ్

First Published Sep 23, 2022, 8:03 AM IST

ఏపీ పాలిటిక్స్ లో నిత్యం ఏదో ఒక రగడ రగులుతూనే ఉంది. అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు జోడించారు.

ఏపీ పాలిటిక్స్ లో నిత్యం ఏదో ఒక రగడ రగులుతూనే ఉంది. అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు జోడించారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై టిడిపి రగిలిపోతోంది. ఇక ఏపీ పాలిటిక్స్ లో సినీతారల ప్రమేయం ఎక్కువగా ఉంటుంది. 

ఎన్టీఆర్ పేరు తొలగించడంతో టిడిపితో పాటు నందమూరి ఫ్యామిలీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తన స్పందన తెలియజేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దీనిపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ స్పదించిన విధానం అసలు గొడవ కంటే పెద్ద రచ్చగా మారిపోయింది. 

ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకులు. ఒకరి పేరు తీసేసి మరొకరి పేరు పెట్టడం ద్వారా వారి గౌరవం, ఖ్యాతి తగ్గదు అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్ లో అసలు పాయింట్ చెప్పకుండా సేఫ్ గేమ్ ఆడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నొప్పించి తానొవ్వక అనే సూత్రాన్ని బాగా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. 

పేరు తీసేయడం వల్ల ఎన్టీఆర్ ఖ్యాతి తగ్గదు అని అర్థం వచ్చేలా కామెంట్స్ చేశాడు. కానీ ఈ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నాను అని కానీ వ్యతిరేకిస్తున్నాను అనికాని చెప్పలేదు. దీనితో ఎన్టీఆర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెబుతూ ట్వీట్ చేశాడు. 

నాణ్యమైన విద్య వైద్యం అందించాలని ఎన్టీఆర్ గారు ఈ యూనివర్సిటీకి అంకురార్పణ చేశారు. ఎన్టీఆర్ చేసిన కృషికి గుర్తుగా ఈ యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ 25 ఏళ్లుగా ఆ పేరు అలాగే కొనసాగుతోంది. కానీ ఇప్పుడు యూనివర్సిటీ పేరు తొలగించడం నన్ను బాధించింది. రాజకీయాల కోసం ఏళ్లతరబడి భావోద్వేగాలతో ముడిపడిన అంశాన్ని వాడుకోవడం తప్పు అంటూ కళ్యాణ్ రామ్ సూటిగా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. 

దీనితో కళ్యాణ్ రామ్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. కానీ డిప్లమాటిక్ గా వ్యవరించిన తారక్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తారక్ అభిమానులు చాలా మంది ఆయన ఫ్యూచర్ లో రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. అలాంటప్పుడు తారక్ ఈ విషయంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేసి ఉండాల్సింది అని కామన్ ఆడియన్స్ పేర్కొంటున్నారు. 

click me!