Krishna Vrinda Vihari Review: `కృష్ణ వ్రిందా విహారి` ప్రీమియర్ షో టాక్‌.. నాగశౌర్యకి ఇప్పుడైనా హిట్‌ వచ్చిందా?

First Published | Sep 23, 2022, 6:20 AM IST

వరుస పరాజయాలతో ఉన్న నాగశౌర్య ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ `కృష్ణ వ్రిందా విహారి` అంటూ వస్తున్నాడు. నేడు శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఆయనకు హిట్‌ ఇచ్చిందా లేదా అనేది ప్రీమియర్స్ షో రివ్యూలో తెలుసుకుందాం. 
 

`ఊహలుగుసగుసలాడే` చిత్ర విజయంతో తెలుగులో యంగ్‌ హీరోగా మంచి మంచిగుర్తింపు తెచ్చుకున్నాడు నాగశౌర్య. డిఫరెంట్‌ సినిమాతో హిట్‌ కొట్టి మూడో సినిమాతో తన ప్రత్యేకతని చాటుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్‌టూ బ్యాక్‌ రెండు విజయాలు అందుకున్నాడు కానీ,ఆయన చేసిన మాస్ సినిమాలు బోల్తా కొట్టాయి. వరుసగా పరాజయాలు వెంటాడాయి. ఈక్రమంలో `ఛలో`చిత్రంతో సక్సెస్‌ కొట్టిన నాగశౌర్యకి ఆ తర్వాత హిట్‌ లేదు.కెరీర్‌ లాక్కొస్తున్నాడు. ఈక్రమంలో ఎన్నో ఆశలతో ప్రస్తుతం `అలా ఎలా` ఫేమ్ అనీష్‌ కృష్ణ దర్శకత్వంలో `కృష్ణ వ్రిందా విహారి` అంటూ అచ్చ తెలుగు టైటిల్ తో వస్తున్నాడు. కొత్త అమ్మాయి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా శుక్రవారం(సెప్టెంబర్ 23)న విడుదలైంది. అయితే ఇండియాలో కంటేముందే యూఎస్‌లో ప్రీమియర్స్ పడ్డాయి. మరి అక్కడి రిపోర్ట్ ఎలా ఉందనేది ప్రీమియర్స్ షో రివ్యూ(Krishna Vrinda Vihari Premiere Show Talk)లో తెలుసుకుందాం. 
 

కథ పరంగా చూస్తే, కృష్ణ సాఫ్ట్ వేర్‌ కంపెనీలో టెక్నీకల్‌ ట్రైనర్‌గా జాయిన్‌ అవుతాడు. అదే కంపెనీలో కృష్ణ ప్రాజెక్ట్ మేనేజర్‌గా వ్రిందా(షిర్లే) ఉంటుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సరదాగా సాగుతుంటాయి. ఇద్దరి మధ్య పరిచయం, వర్క్ లో వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్, ఇద్దరి మధ్య ప్రేమపుట్టే సన్నివేశాలు ఫన్నీగా సాగుతుంటాయి. ఇంటర్వెల్‌ ముందు చిన్న ట్విస్ట్ఉంటుంది. సెకండాఫ్‌లో సినిమా ఫ్యామిలీ వైపు టర్న్ తీసుకుంటుంది. Krishna Vrinda Vihari Premiere Show Review.

Latest Videos


తన ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాల్లో కృష్ణ పడే ఇబ్బందులు ఫన్నీగా కామెడీని పంచుతాయి. ఫ్యామిలీ డ్రామా దీనికి తోడవుతుంది. సాంప్రదాయాలకు విలువిచ్చే కృష్ణ ఫ్యామిలీలో మోడ్రన్‌ అమ్మాయి అడ్జెస్ట్ మెంట్‌ కి సంబంధించిన సీన్లు వినోదాత్మకంగా సాగుతుంటాయి. ఈ క్రమంలో ఇద్దరు లవర్స్ మధ్య వచ్చే సంఘర్షణ కాస్త ఫ్రెష్‌ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. KVV Review.

ఓవరాల్‌గా సినిమా కొత్త కంటెంట్‌ కాదు, కానీ అలాగని బోర్‌ తెప్పించేలా లేదు. పాత కథనే కాస్త ఫన్నీవేలో, సరదా సరదాగా తీసుకెళ్లాడు దర్శకుడు అనీష్‌ కృష్ణ. పాటలు ప్లజెంట్‌ ఫీలింగ్‌ ని తీసుకొస్తాయి. అయితే సినిమాలో ఎలాంటి మెరుపులు లేకపోవడం మైనస్‌. సినిమా అంతా రెగ్యూలర్‌గానే సాగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎన్నో సినిమాల్లో చూసేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. లీడ్‌ పెయిర్స్ మధ్య వచ్చే సంఘర్షణ, కృష్ణ ఫ్యామిలీలో హీరోయిన్ అడ్జెస్ట్ అయ్యే సందర్భంలో వచ్చే సహజమైన కామెడీ పండింది. 
 

కథ పరంగా సినిమాలో స్టఫ్‌ లేదనే టాక్ ప్రీమియర్స్ టాక్‌ నుంచి వినిపిస్తుంది. ఫస్టాఫ్‌ మొత్తం లవ్ ట్రాక్‌ చుట్టూతే తిరుగుతుంది. దానికి తగ్గ ఇంకా బలమైన కథ ఉంటే బాగుండేదనే ఫీలింగ్‌ కలుగుతుంది. దర్శకుడు అనీష్‌కృష్ణ మార్క్ కూల్‌, లైటర్‌ వేలో సినిమా సాగుతుంది. సంగీతం పరంగా మహతి స్వర సాగర్‌ సంగీతం బాగుంది. ప్రారంభంలో వచ్చే `ఏముందే` పాట ప్లజెంట్‌గా ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చే `యూ ఆర్ మై డ్రీమ్ గర్ల్` సైతం ఆకట్టుకునేలా ఉంది. 
 

లీడ్‌ పెయిర్‌ నాగశౌర్య, హీరోయిన్‌ షిర్లే జంట చాలా ఫ్రెష్‌గా ఉంది. వారి పాత్రలు నీట్‌గా బాగున్నాయి. నటన కూల్‌గా ఉంది. ఫ్యామిలీ, ఫన్నీ సీన్లు సినిమాకు ప్లస్‌, సంగీతం, బీజీఎం మరో ప్లస్‌ గా చెప్పొచ్చు. విజువల్స్ బాగున్నాయి. మొత్తంగా ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే నచ్చే సినిమా అవుతుంది. నాగశౌర్య నటించిన గత నాలుగైదు సినిమాలతో పోల్చితే బెటర్‌గా ఉంది. అలాగని ఆహా.. ఓహో అనేలా లేదు. గన్‌ షాట్‌ బ్లాక్‌ బస్టర్‌ అని చెప్పలేం, అలాగని చెత్తగా ఉందని కూడా చెప్పలేం. జస్ట్ ఓకే. 
 

click me!