యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో కుటుంబ కథా చిత్రాలు చేసింది చాలా తక్కువ. ఎక్కువగా మాస్ కమర్షియల్ చిత్రాలే చేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ కి పడ్డ హిట్స్ కూడా మాస్ చిత్రాలే అని చెప్పొచ్చు. అలాంటి టైంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎన్టీఆర్ తో ఒక ప్రయోగం చేశారు.
ఆ ప్రయోగమే బృందావనం చిత్రం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ముందు పెద్ద గొడవే జరిగిందట. ఎన్టీఆర్ కూడా చాలా విషయాల్లో దిల్ రాజుతో విభేదించారట.
దిల్ రాజు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. వంశీ పైడిపల్లి ఎన్టీఆర్ ని కొత్తగా చూపించాలి అని అనుకున్నారు. మీసాలు లేకుండా ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే చర్చ జరిగింది. ఎన్టీఆర్ ని మీసాలు లేకుండా చూపించాలి అంటే చిత్ర యూనిట్ లో చాలా మంది ఒప్పుకోలేదు. గొడవ చేశారు. కానీ ఆ లుక్కే ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. చెవి పోగు పెట్టి చూపించాం.
కథ విషయంలో కూడా తారక్ చాలా గొడవ చేశాడు. కథలో ఎన్టీఆర్ సన్నిహితుడు కొడాలి నాని కూడా ఇన్వాల్వ్ అయినట్లు దిల్ రాజు తెలిపారు. షూటింగ్ పూర్తయ్యాక ఇక బృందావనం చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఒకవైపు రజనీకాంత్ రోబో చిత్రం బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. మరోవైపు మహేష్ బాబు ఖలేజా కూడా రిలీజ్ అయింది.
కానీ అది దసరా సీజన్. ఫ్యామిలీ మూవీ కావడంతో వారం ముందే ఎన్టీఆర్ ఫ్యామిలీతో పాటు చాలా మంది సెలెబ్రెటీలకు ప్రీమియర్ షో వేశాం. అందరూ అద్భుతంగా ఉందని చెప్పారు. దీనితో రోబో, ఖలేజా చిత్రాలు రిలీజ్ అయినప్పటికీ బృందావనం చిత్రాన్ని కూడా రిలీజ్ చేసినట్లు దిల్ రాజు తెలిపారు.
సినిమా సూపర్ హిట్ అయింది. బృందావనం చిత్రం పట్ల ఎన్టీఆర్ తల్లి షాలిని చాలా సంతోషం వ్యక్తం చేశారట. ఆ విధంగా ఎన్టీఆర్ తో ఫస్ట్ టైం చేసిన మూవీ బృందావనం హిట్ అయినట్లు దిల్ రాజు తెలిపారు.