కన్నడలో రెండు సినిమాల్లో నటించిన శ్రీలీల తెలుగులో ఈ స్దాయిలో సెట్ అయ్యి స్టార్ అయ్యి పోతుందని ఊహించి ఉండదు. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆమె రెండో మూవీకే మాస్ మహరాజ్ రవితేజ సరసన ధమాకాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా సూపర్ హిట్టవటంలో ఆమెదే ప్రధాన పాత్ర అని ఇండస్ట్రీ మొత్తం హోరెత్తిపోయింది. ఆ సినిమాలో ఆమె నటనకు, స్క్రీన్ ప్రజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. దాంతో ఓవర్ నైట్ లో హ్యాపినింగ్ హీరోయిన్ అయ్యిపోయింది.
చిత్రం ఏమిటంటే శ్రీలీల ధమాకా విడుదలకు ముందే ఆమె ఆరడజను సినిమాలను ఓకే చేసింది. ఆమె చేసిన సినిమాలు వరస రిలీజ్ కు ఉన్నాయి. మరో ప్రక్క మొదట అనుకున్న షెడ్యూల్స్ కు తగినట్లు డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక చేతులెత్తేసింది. అయితే మెల్లిగా వాటిల్లో కొన్ని డ్రాప్ చేసుకున్నా కొన్ని అలాగే కష్టపడి ఫినిష్ చేసుకుంది.
వరుసగా సినిమాలు చేస్తున్న శ్రీలీలకు ధమాకా స్దాయి హిట్ మాత్రం రావడం లేదు. సీనియర్ హీరోలు,యంగ్ హీరోలు అనే తేడా లేకుండా ఒక ఏడాదిలోనే పదికిపైగా సినిమాలను లైన్లో పెట్టినా ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ దక్కలేదు. శ్రీలీల చేసిన రామ్‌తో 'స్కంద'.. 'ఆదికేశవ' .. 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్' సినిమాలు చాలా దారుణమైన పరాజయాలను చూశాయి. ఆ తరువాత వచ్చిన 'గుంటూరు కారం' యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది. భగవంత్ కేసరితో ఆమెకు కలిసొచ్చిందేమీ లేదు. ప్రస్తుతం 'ఉస్తాద్ భగత్ సింగ్' మాత్రమే సెట్స్ పై ఉంది. కానీ ఇప్పుడిప్పుడే పూర్తయ్యే విధానం కనపడటం లేదు.
అందం .. అభినయం .. డాన్స్ .. ఈ మూడు విషయాల్లో వంకపెట్టలేని హీరోయిన్ ఆమె. అలాంటి శ్రీలీలకు ఈ మధ్య వరుస పరాజయాలు ఎదురవుతూ రావడం ఆమె అభిమానులను నిరాశపరిచిన అంశం. అయితే ఆమె డాన్స్ అదరకొడుతుందని...కేవలం డ్యాన్సులకే పరిమితమైన ఆ పాత్రలు ఎక్కువ వస్తున్నాయట. కొన్ని సినిమాల్లో స్పెషల్ డాన్స్ లకు కూడా అడుగుతున్నారు. తెలుగు, తమిళ సినిమా నిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతున్నా పెద్ద హీరోలు సినిమాలకు కూడా నో చెప్పేస్తోంది.
రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమాని,తమిళ సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందనే వార్తలు వస్తున్నాయి. కార్తీ సరసన సర్దార్ 2 లో అడిగితే వద్దని చెప్పిందిట. అందుకు కారణం తాను లీడింగ్ లేడీస్ లో ఒకరుగా ఉండటం ఇష్టం లేక అని తెలిసింది. తెలుగులో కూడా ఇద్దరు స్టార్ హీరో సినిమాలకు నో చెప్పిందనే వార్త స్ప్రెడ్ అవుతోంది. అసలు ఏం జరుగుతోంది
శ్రీలీల ఇప్పుడు కొత్తగా ఓ రూల్ పెట్టుకుందిట. తాను సోలో హీరోయిన్ గానే ఉండాలి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలు చేయదు. అలాగే స్పెషల్, ఐటమ్ సాంగ్స్ చేయదు. తన ఇమేజ్ కు,వయస్సుకు తగ్గ పాత్రే చేస్తుంది. కెరీర్ కు పనికి రాని పాత్రలు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా వద్దని మొహమాటం లేకుండా మేనేజర్ చేత చెప్పిస్తోందిట. మరో ప్రక్క డాక్టర్ కోర్స్ చేస్తున్న ఆమె తన చదువు మీద కూడా కాన్సర్టేట్ చేస్తోంది.