జూనియర్ ఎన్టీఆర్ కు బాగా ఇష్టమైన డ్యాన్సర్ ఎవరో తెలుసా? తారక్ కంటే బాగా డ్యాన్స్ చేస్తాడా..?

Published : Feb 09, 2026, 10:37 AM IST

టాలీవుడ్ లో మాత్రమే కాదు..ఇండియాలోనే గొప్ప డ్యాన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన డ్యాన్స్ కు ఫిదా అవ్వనివారంటూ ఉండరు. అటువంటి ఎన్టీఆర్ కు నచ్చిన డ్యాన్సర్ కమ్ హీరో ఎవరో తెలుసా? 

PREV
15
ఆల్ రౌండర్ ఎన్టీఆర్..

ఎన్టీఆర్‌ను కంప్లీట్ యాక్టర్‌ అనడంలో.. ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా డ్యాన్స్ విషయంలో చిరంజీవి తర్వాత ప్రొఫెషనల్ డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. ఆయన డ్యాన్స్‌లోని గ్రేస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అల్లు అర్జున్ కూడా డాన్స్ పరంగా ఎన్టీఆర్‌కు గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే.నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్ వంటి విభాగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్, ఒక హీరో డాన్స్‌కు తాను వీరాభిమానినని గతంలో వెల్లడించారు. ఇంతకీ ఎవరా హీరో?

25
డ్యాన్స్ గా తిరుగులేని ఇమేజ్ తారక్ సొంతం

దేశంలోని బెస్ట్ డ్యాన్సర్స్ జాబితాలో ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంటుంది. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో.. పలువురు స్టార్ కొరియోగ్రాఫర్లు కూడా వెల్లడించారు. ఎలాంటి స్టెప్ అయినా పెద్దగా ప్రాక్టీస్ చేయకుండా వెంటనే చేయగల సామర్థ్యం ఎన్టీఆర్‌కు ఉందని అంటుంటారు. ఎటువంటి రిహార్సల్స్ చేయకుండానే నేరుగా డ్యాన్స్ చేయగలిగే ప్రతిభ ఆయనది. బాల్యంలో శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందిన ఎన్టీఆర్ కూచిపూడి నేర్చుకుని పలు స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చాడు. ఆ నేపథ్యమే ఆయన మోడ్రన్ డ్యాన్సర్ గా మారడానికి ఉపయోగపడింది.

35
ఎన్టీఆర్ ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరు?

గతంలో లావుగా ఉన్నప్పటికీ కఠినమైన స్టెప్స్‌ను కూడా చాలా ఈజ్ తో .. స్పీడ్ గా వేసి.. అందరిని ఆశ్చర్యపరిచాడు తారక్. తన ట్యాలెంట్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించాడు. ఇక ఎన్టీఆర్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని జాన్వీ కపూర్ లాంటి కొంత మంది హీరోయిన్లు కూడా అంటుంటారు. ఇంత గొప్ప డ్యాన్సర్ అయిన ఎన్టీఆర్ తనకు ఫేవరెట్ హీరో, మంచి డ్యాన్సర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో దేవర సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నై వెళ్లిన సందర్భంగా తారక్ దళపతి విజయ్ డాన్స్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

45
ఎన్టీఆర్ మాట్లాడుతూ..

ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “డ్యాన్స్ అనేది డ్యాన్స్‌లా ఉండాలి. ఫైట్‌లా లేదా జిమ్నాస్టిక్స్‌లా కాకూడదు. విజయ్ సర్ చాలా కూల్‌గా ఉంటూనే అందంగా డాన్స్ చేస్తారు. ఆయన కష్టపడుతున్నట్లు అనిపించదు. విజయ్ డాన్స్‌కు నేను వీరాభిమానిని” అని ఎన్టీఆర్ చెప్పారు.అదే సమయంలో తాను డాన్స్ చేయడాన్ని అంతగా ఇష్టపడనని, డైలాగ్స్, యాక్టింగ్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేస్తానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో విజయ్ అభిమానులు కూడా అప్పట్లో తెగ సంబరపడిపోయారు.

55
ఈసారి గట్టిగా కొట్టాలని ప్రయత్నం..

ఇక సినిమాల విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ మూవీ బిజీలో ఉన్నాడు. ఈసినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ దేవర 2 ను స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక దళపతి విజయ్ మాత్రం సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించి.. రాజకీయాల్లో బిజీ కాబోతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించిన చివరి సినిమా జననాయగన్ రిలీజ్ సెన్సార్ సమస్య వల్ల ఆగిపోయింది.

Read more Photos on
click me!

Recommended Stories