దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశారట టీమ్. అది కూడా ఆంధ్రా రాజధాని అమరావతిలో ఈ ఆవెంట్ ను మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నారట. అంతే కాదు మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ కు చంద్రబాబుతో సహా పవన్ కళ్యాణ్, బాలయ్యను కూడా ముఖ్య అతిధులుగా రానున్నట్టు సమాచారం.
ఈ న్యూస్ అఫిషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. ఫిల్మ్ సర్కిల్ లో మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. చాలా కాలంగా నందమూరి ప్యామిలీలో లుకలుకలు, చంద్రబాబు ఫ్యామిలీతో ఎన్టీఆర్ కు చెడింది అని వార్తలు చూస్తూనే ఉన్నాం. కాని వారు ఎప్పుడు బయటపడింది లేదు.