`దేవర` ట్రైలర్‌లోనే అసలు కథ, కొరటాల శివ రిస్క్ చేస్తున్నాడా? ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో ఆందోళన?

Published : Sep 10, 2024, 06:54 PM ISTUpdated : Sep 10, 2024, 07:16 PM IST

ఎన్టీఆర్‌ నటిస్తున్న `దేవర` ట్రైలర్‌ వచ్చింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు నెటిజన్లు. తారక్‌ ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు.  

PREV
18
`దేవర` ట్రైలర్‌లోనే అసలు కథ, కొరటాల శివ రిస్క్ చేస్తున్నాడా? ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ లో ఆందోళన?

ఎన్టీఆర్‌ హీరోగా రూపొందిన `దేవర` మూవీ ట్రైలర్‌ విడుదలైంది. ముంబయిలో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ట్రైలర్‌ని విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్‌ తారక్‌ ఫ్యాన్స్‌ కి ట్రీట్‌లా ఉంది. అదే సమయంలో పలు విమర్శలు వస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ పెద్ద రిస్క్ చేస్తున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఆ కామెంట్స్ కి కారణమేంటి? ట్రైలర్‌లో ఉన్న మిస్టేక్ ఏంటనేది చూస్తే.. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం, ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం ఇక్కడ చూడండి.

28

ముందుగా ట్రైలర్‌ ని చూస్తే.. `అసలు ఎవరు వాళ్లంతా? అని అజయ్‌ వాయిస్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది. కులం లేదు, మతం లేదు. భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏదీ లేని వాళ్ల కళ్లల్లో మొదటిసారి భయం పురులు కమ్ముకుంది` అని ప్రకాష్‌ రాజ్‌ వాయిస్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో వినిపించడం విశేషం.

ఎలా జరిగింది ఇదంతా అని అజయ్‌ అడగ్గా, సానా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ. మా దేవర కథ అని ప్రకాష్‌ రాజ్‌ వాయిస్ చెప్పగా, దేవరగా ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇవ్వడం అదిరిపోయింది.

మనిషికి బతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యాన్ని సంపే భయాన్ని అవుతా` అని ఎన్టీఆర్‌ చెప్పడం గూస్‌బంమ్స్ తెప్పిస్తుంది. ఆయన రాకతో తన అనుచరులంతా స్వాగతం పలుకుతారు. సంబరాలు చేసుకుంటారు. అదే సమయంలో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తారు ఎన్టీఆర్‌. 

38

ఆ సమయంలోనే సైఫ్‌ అలీ ఖాన్‌.. ఎన్టీఆర్ కలుస్తారు. నవ్వు ఉన్నంత వరకు ఇక్కడ అంతా నీ మాటే దేవర అని సైఫ్‌ చెప్పడం, అంతలోనే దేవరని సంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం దొరకాలి అని సైఫ్‌ చెప్పడం కథలో అసలు విషయం రివీల్‌ అయిపోయింది. అంతలోనే చిన్న దేవర(ఎన్టీఆర్‌ మరో పాత్ర) ఎంట్రీ ఇస్తారు.

ఇందులో తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక చిన్న ఎన్టీఆర్‌.. బిక్కుబిక్కుమంటూ ఆ గ్రామంలో ఉంటాడు. ఆయన వెంట మనుషులు ఉంటారు. ఎప్పుడూ చూడు పిల్లతనం, పిరికితనం అంటూ జాన్వీ కపూర్‌ వాపోతుంది. ఆయన్ని చూసి జాలి పడుతుంది. కుస్తీ పోటీల్లో పాల్గొనేందుకు కూడా వెనకాడుతుంటాడు చిన్న ఎన్టీఆర్‌.

దీంతో వాడికి ఆలయ్య రూపం వచ్చింది గానీ, రక్తం రాలేదే అని జాన్వీ చెప్పడం చిన్న ఎన్టీఆర్‌ పాత్ర ఏంటో అర్థమవుతుంది. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టి పోయినాడు నీ కోడుకు అని చిన్న ఎన్టీఆర్‌ ఆవేశంతో చెప్పడం, మరోవైపు దేవర యాక్షన్‌ చూపించడం అదిరిపోయింది. 
 

48

దీనికి కొనసాగింపుగా దేవర సంద్రం ఎక్కి రెండేళ్లు అవుతుందని ప్రకాష్‌ రాజ్‌ వాయిస్ వస్తుంది. భయం మరిచి ఎప్పుడైన తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే, ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతావుండా అని ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌ చివర్లో అదిరిపోయింది. పోర్ట్ లో అక్రమాలకు పాల్పడుతున్న సైఫ్‌ అలీ ఖాన్‌ బ్యాచ్‌ని ఎదురిస్తాడు ఎన్టీఆర్‌.

మొదట వీళ్లంతా కలిసే ఉంటారు. కానీ పోర్ట్ ని ఆక్రమించుకునేందుకు దేవరని చంపేసేందుకు సైఫ్‌ వెనకాల కుట్ర చేస్తాడు. ఆయనపై ఎటాక్‌ కూడా జరుగుతుంది. అయితే సముద్రంలో పడవలో పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి దేవర కనిపించడు.

ఆయన బతికే ఉన్నాడా? చనిపోయాడా? అనేది సస్పెన్స్. దేవర పంతం కోసం ఎక్కడికో వెళ్లాడు అనేది చిన్న ఎన్టీఆర్‌ చెబుతుంటాడు. మరి ఇంతకి దేవర చనిపోయాడా? బతికే ఉన్నాడా? అనేది ఆసక్తికరం. కొన్ని సీన్లలో దేవర తిరిగి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొరటాల ఏం చేయబోతున్నారో చూడాలి. 
 

58

యాక్షన్‌ పరంగా, ఎమోషన్స్ పరంగా `దేవర` అదిరిపోయిందని తెలుస్తుంది. విజువల్స్, వీఎఫ్‌ఎక్స్, మ్యూజిక్‌, బీజీఎం సినిమాకి నెక్ట్స్ లెవల్‌ కి తీసుకెళ్తాయని చెప్పొచ్చు. ఎమోషన్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్ ఇందులో ప్రధాన భూమిక పోషిస్తాయని ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతుంది.

ఎన్టీఆర్‌ అటు దేవరగా, ఆయన కొడుకుగా అదరగొట్టాడు. సీరియస్‌ పాత్రతో వణుకు పుట్టిస్తే, భయపడే పాత్రలోనూ అదరగొట్టాడు. ఆయన పాత్రలోని రెండు వేరియేషన్స్ సినిమాలో హైలైట్‌ కాబోతుందని తెలుస్తుంది. 
 

68

కానీ ఇక్కడే దర్శకుడు కొరటాల పెద్ద మిస్టేక్‌ చేసినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ లోనే అసలు కథ అంతా చెప్పేశాడు. ఎన్టీఆర్‌ రెండు పాత్రలను చూపించడంతోపాటు, అసలు కథలో సంఘర్షణ ఏంటనేది చూపించాడు. స్నేహంగా ఉండే ఎన్టీఆర్, సైఫ్‌, ఆ తర్వాత విడిపోవడం, సైఫ్‌ కుట్ర చేయడం, దేవర పాత్ర తప్పిపోవడం కథలోని మెయిన్‌ పాయింట్‌ని రివీల్‌ చేసినట్టుగా అనిపిస్తుంది.

మరోవైపు చిన్న ఎన్టీఆర్‌ పిరికిగా ఉండటం, సైఫ్‌ అలీఖాన్‌ ఆగడాలు పెరిగిపోవడం వంటివి చూస్తుంటే రొటీన్‌ కథగానే ఉండబోతుందని తెలుస్తుంది. అంతేకాదు ఇలాంటి ఫ్లాట్‌తోనే చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో కొత్తదనం ఏముందనే చర్చ మొదలైంది. మొత్తంగా కథ విషయంలో విమర్శలు వస్తున్నాయి. 
 

78

దీనికితోడు అసలు కథని రివీల్‌ చేయడంతో ఇక సినిమాలో ఏముందనే ఫీలింగ్‌ కలుగుతుంది. రొటీన్‌ కథగానే ఉండబోతుందనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ మూవీకి కథనే పెద్ద మైనస్‌గా మారబోతుందనే విమర్శలు వస్తున్నాయి. మరి ఇది కొరటాల కావాలనే చేశారా? ఆడియెన్స్ ని ముందస్తుగానే ప్రిపేర్‌ చేయడం కోసం ఇలా చేశాడా ? అనేది తెలియాల్సి ఉంది.

88

ఎన్టీఆర్‌ హీరోగా, జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా, శ్రీకాంత్‌ కీలక పాత్రలో నటించిన `దేవర` మూవీ ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఆరేళ్ల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్‌ నుంచి వస్తోన్న సినిమా ఇది. ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories