మరోవైపు ఈ సందర్భంగా గూస్‌బంమ్స్ తెప్పించే విషయాన్ని వెల్లడించారు. సినిమాలో 40 నిమిషాలు రాక్ అని, పూనకాలు తెప్పించేలా ఉంటుందన్నారు. దానికోసం తాను ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు. ఆయా సీన్లని దర్శకుడు కొరటాల శివ అద్భుతంగా తెరకెక్కించారని, విజువల్స్ వండర్‌గా ఉంటాయని, అదొక ట్రీట్‌లా ఉంటుందన్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ స్పెషల్ హైలైట్‌గా ఉంటాయని వెల్లడించారు ఎన్టీఆర్.
`దేవర` చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. సైఫ్ అలీ ఖాన్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. శ్రీకాంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ పతాకాలపై కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ నెల 27న పాన్ ఇండియారేంజ్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని సాధిస్తుందో చూడాలి.