vani viswanath
సీనియర్ నటి వాణి విశ్వనాథ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. మరోవైపు పలు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే వాణి విశ్వనాథ్.. మలయాళ నటుడు, దర్శకుడు బాలు రాజ్‌ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. అయితే వాణి విశ్వనాథ్.. అంతకంటే ముందే మరో రైటర్‌ని ప్రేమించిందట.
Vani Viswanath
వాణి విశ్వనాథ్ మలయాళ నటి. మలయాళంతోపాటు తెలుగులోనూ ఎక్కువగా సినిమాల చేశారు. `ధర్మతేజ`, `సింహ స్వప్నం`, `సాహసమే నా ఊపిరి`, `కొదమ సింహం`, `మామా అల్లుడు`, `పరిష్కారం`, `సర్పయాగం`, `ఘరానా మొగుడు`, `సామ్రాట్ అశోక`, `గ్యాంగ్ మాస్టర్` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సీనియర్ హీరోలందరితోనూ కలిసి నటించింది.
vani viswanath
వాణి విశ్వనాథ్ వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగు, మలయాళంలోనే కాదు, తమిళం, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. ఈ క్రమంలో వాణి విశ్వనాథ్ ఓ యంగ్ రైటర్‌తో ప్రేమలో పడిందట.
అది పెళ్లి వరకు వెళ్లిందట. ఆయన ఎవరో కాదు అప్పట్లో స్టార్ రైటర్‌గా రాణించిన తోటపల్లి మధు కావడం విశేషం. ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. వాణి విశ్వనాథ్‌తో పెళ్లి వరకు వెళ్లినట్టు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ, `భలే దంపతులు` సమయంలో తాను, వాణి విశ్వనాథ్ బాగా ప్రేమించుకున్నామని, అంతేకాదు ఏకంగా పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. కేరళాలోని గురువాయి టెంపుల్‌కి కూడా వెళ్లారట.
అంతకు ముందే ఏడాదిపాటు కలిసి తిరిగామని, తరచూ కలుస్తుండేవాళ్లమని, ఇక ఎలాగైనా మ్యారేజ్ చేసుకోవాలని టెంపుల్‌కి వెళితే ఆ రోజు గుడి తెరవలేదు. సూర్యగ్రహనం కారణంగా ఆ రోజు తెరవలేదు. దీంతో తిరిగి వెనక్కి వచ్చాం. అలా మిస్ అయిపోయింది.