సినిమాకు 200 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే ఖరీదైన విలన్ ఎవరో తెలుసా?
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అయితే భారీగా వసూలు చేసే విలన్ గురించి మీకు తెలుసా? ఒక్క సినిమాకే 200 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఆ నటుడు ఎవరు?
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలు చాలామంది ఉన్నారు. అయితే భారీగా వసూలు చేసే విలన్ గురించి మీకు తెలుసా? ఒక్క సినిమాకే 200 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్న ఆ నటుడు ఎవరు?
ఒక సినిమా హిట్ కావడానికి హీరో పాత్ర ఎంత ముఖ్యమో, విలన్ పాత్ర కూడా అంతే ముఖ్యమైనది . హీరోని మాస్ గా చూపించాలంటే విలన్ పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉండాలి. గతంలో విలన్ పాత్రల కోసమే కొంత మంది నటులు ఉండేవారు. కానీ ఇప్పుడు హీరోలే విలన్ పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read: ప్రభాస్ లాంటి కొడుకు కావాలంటున్న స్టార్ హీరోయిన్ ఎవరు?
ఈమధ్య హీరోలు కూడా విలన్లుగా మారుతున్నారు. విలన్ల క్రేజ్ ను భారీగా పెంచేస్తున్నారు. ఈక్రమంలోనే కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, జగపతిబాబు, శ్రీకాంత్, వంటి వారు పాన్ ఇండియా సినిమాల్లో విలన్లుగా నటించి పాపులర్ అయ్యారు.
Also Read: సింగర్ సునీత కు ప్రవస్తి కౌంటర్, సైగలు చేసుకుని మరీ నాకు అన్యాయం చేశారు, వాళ్లు ఎలా టాప్ లో ఉన్నారు?
హీరోగా నటించడం కంటే విలన్ గా నటించడానికి ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. విలన్ గా నటించి కమల్ హాసన్ 100 కోట్లకు పైగా పారితోషికం తీసుకున్నారు. ఇప్పుడు హీరో యష్ వంతు వచ్చింది. విలన్ పాత్ర చేస్తున్నందకు యష్ 200 కోట్లు తీసుకుంటున్నారు.
Also Read: మహేష్ బాబు, నాగార్జునతో భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన స్టార్ డైరెక్టర్, ఎందుకు వర్కౌట్ అవ్వలేదు.
టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమా లో నటిస్తున్నారు యష్. ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తున్నారు. మరో పాన్ ఇండియా సినిమాలో విలన్ గా నటించడానికి యష్ ఒప్పుకున్నారు. ఆ సినిమాకే ఆయనకు 200 కోట్లు పారితోషికం ఇస్తున్నారు.
సినిమా మరేదో కాదు రామాయణం. ఈ సినిమాలో రాముడిగా రణ్ బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ పాత్రకు 200 కోట్లు పారితోషికం ఇస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది.