Allu Arjun Atlee Film: అనుభవం లేకుండా అల్లు-అట్లీ సినిమాలో మ్యూజిక్‌ ఛాన్స్‌.. అతనిలో అంత విషయం ఉందా?

Allu Arjun Atlee Film: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సక్సెస్‌ఫుల్‌ దర్శకుడు అట్లీ కాంబినేషనలో ప్యాన్‌ ఇండియా చిత్రం రానుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా బయటకు వస్తున్న విషయాలు తెలుస్తుంటే.. సినీ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. ఇక సినిమాని సన్‌ పిక్చర్స్‌ భారీ నిర్మిస్తోంది. పుష్ప సినిమాతో గ్లోబల్‌ గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఈ సినిమా కూడా అంతకుమించి ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సినిమా సంగీతం బాధ్యతలను ఒక్క సినిమాకి చేయని కొత్త మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతిలో పెట్టడం అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు సినీ ప్రేక్షకులు అతనిలో అంత సీన్‌ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు.. అతని చరిత్ర గురించి తెలుసుకుందామా మరి..  
 

Sai Abhyanker to Compose Music for Allu Arjun Atlee Film, he has No Film Experience Yet in telugu tbr
Allu Arjun

అల్లు-అట్లీ ప్యాన్‌ ఇండియా సినిమా కథకు తగ్గట్లు అంతర్జాతీయ ప్రమాణాలతో స్టంట్స్‌, గ్రాఫిక్స్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఓ హాలీవుడ్‌ సినిమాలకు గ్రాఫిక్స్‌ చేసిన ప్రముఖ కంపెనీతో వారు సంప్రదింపులు జరిపారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర చర్చ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పాన్ ఇండియా సినిమా సంగీత బాధ్యతలను 20 ఏళ్ల సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ చేతిలో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటివరకు అధికారికంగా చెప్పకపోయినా.. అతనిపేరే బలంగా వినిపిస్తోంది. అయితే.. సాయి అభ్యంకర్‌ గతంలో ఒక్క సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా పనిచేయలేదు. మరి ఏ నమ్మకంతో బన్నీ తన సినిమాకు అవకాశం ఇస్తున్నారన్న చర్చ మొదలైంది. 

Sai Abhyanker to Compose Music for Allu Arjun Atlee Film, he has No Film Experience Yet in telugu tbr
Atlee - Allu Arjun Movie

సాయి అభ్యంకర్ సినిమాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పనిచేయకపోయినా... పలు ప్రైవేట్ సాంగ్స్‌కి పనిచేసి యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ పెంచుకున్నారు. అంతేకాదు.. అతను మ్యూజిక్ చేసిన పాటలు వందల మిలియన్లను తెచ్చిపెట్టాయి. టాలెంట్‌ ఉంటూ చాలు.. వయసు, అనుభవం అనే భేదం లేదు అనేలా సాయి తన టాలెంట్‌ చూపగలడని అల్లు-అట్లీ నమ్ముతున్నారంట. 


allu arjun and atlee sun pictures

ప్రముఖ స్టార్ సింగర్స్ టిప్పు, హరిణి దంపతుల కుమారుడు సాయి అభయంకర్ అని అందువల్లే బన్నీ సినిమాలో అవకాశం దక్కిందని పలువురు మాట్లాడుకుంటున్నారు. అయితే.. అభయంకర్‌ను కొన్ని ప్రైవేట్ పాటలతో పాపులర్ అయ్యాడు. అతను కంపోజ్ చేసిన 'కట్చి సేరా’, ‘ఆసా కూడ’ అందరినీ ఆకట్టుకున్నాయి. ఆ పాటలను 200 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా లోకేశ్ కనగరాజ్ స్టోరీ అందిస్తున్నబెంజ్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారంట. త్వరలో దర్శకుడు ఆర్జే బాలాజీతో తమిళ స్టార్ హీరో సూర్య చేసే చిత్రానికి కూడా అతనే మ్యూజిక్ డైరెక్టర్‌ అని టాక్‌ నడుస్తోంది. తన యూట్యూబ్‌ సాంగ్స్‌తోనే బడా హీరోలు, దర్శకుల దృష్టిలో పడిపోయాడు సాయి అభయంకర్. దీంతో అల్లు అర్జున్ - అట్లీ చూపు కూడా అతనిమీదే ఉందని అంటున్నారు. 

Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster

చిన్న వయసులోనే మ్యూజిక్‌ డైరెక్టర్‌ రావడం చాలా అరుదు.. ఇప్పటి వరకు ఏఆర్ రెహమాన్, యువన్ శంకర్ రాజా, హరీస్ జయరాజ్ లాంటి సంగీత దర్శకులు 27 ఏళ్ల వయసులోనే పెద్ద సినిమాలకు పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఇక అనిరుధ్ 23 ఏళ్లకే పెద్దసినిమాతో అరంగేట్రం చేశారు. ఇక సాయి అభ్యంకర్‌ ప్రస్తుత వయసు కేవలం 20 సంవత్సరాలే. ఈ వయసులోనే బన్నీ, అట్లీ లాంటి స్టార్ కాంబినేషన్‌లో అవకాశం దక్కించుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. 

Allu Arjun Next Movie with Atlee: A Hollywood-Style Sci-Fi Blockbuster

సాయి అభ్యంకర్ ‘రాక్ స్టార్’ అనిరుధ్ వద్ద అడిషనల్ మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా కొంతకాలంగా పనిచేస్తున్నారు. అతనితో కలిసి ‘దేవత’, ‘కూలీ’ వంటి సినిమాలకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాడు. అనిరుధ్ వద్దే సాయి సంగీతంలో నైపుణ్యం పొందాడని ఇండస్ట్రీ టాక్‌. దీంతోపాటు వారసత్వంగా తల్లిదండ్రులు ఫేమస్‌ ప్లేబ్యాక్‌ సింగర్స్‌ కావడం వల్ల కూడా చిన్ననాటి నుంచే ఆ రంగం వైపు కెరీర్‌ ప్రారంభించి ఇప్పుడు రాటుదేలాడని సినీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఏదేమైనా 20 ఏళ్లకే ఓ ప్యాన్‌ ఇండియా సినిమాకు సంగీతం అందించడం.. ఆ ఛాలెంజ్ స్వీకరించడం కూడా గొప్పవిషయమే. 

Latest Videos

vuukle one pixel image
click me!