కళ్యాణ్ రామ్ కాలర్ పట్టుకుని ఎగరేసిన ఎన్టీఆర్, హీరోలకు సమానమైన హీరోయిన్ విజయశాంతి మాత్రమే

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు.

Jr NTR Speech at Arjun Son Of Vyjayanthi Pre Release event in telugu dtr
Jr NTR, Kalyan Ram

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ తల్లిగా, పోలీస్ అధికారిగా ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. విజయశాంతి పోలీస్ గెటప్ లో కనిపిస్తే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం ఏప్రిల్ 18న రిలీజ్ కి రెడీ అవుతుండడంతో తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. 

Jr NTR Speech at Arjun Son Of Vyjayanthi Pre Release event in telugu dtr

ఎన్టీఆర్ ప్రసంగం ఆసక్తికరంగా సాగింది. విజయశాంతి గారు ఈ వేదికపై ఉండడం వల్ల నాన్నగారు లేరు అనే లోటు తీరింది అని ఎన్టీఆర్ తెలిపారు. ఇండియన్ సినిమాలోనే విజయశాంతి గారికి సమానమైన హీరోయిన్ లేరు అంటూ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఆమె చేసిన పాత్రలో ఇంకెవరికీ సాధ్యం కాదు. 


ఈ ఈవెంట్ కి హాజరు కావడం అనే సంతోషం కంటే ఇంకాస్త ఎక్కువ సంతోషం ఉంది నాకు. దానికి కారణం ఈ చిత్రాన్ని ముందే చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ చిత్రం లేదు అని తారక్ తెలిపారు. దర్శకులు, నిర్మాతలు, నటీనటులు ప్రతి ఒక్కరూ ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టేశారు అని తారక్ పేర్కొన్నారు. 

Arjun Son Of Vyjayanthi

ఇక వేదికపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ బ్రోమాన్స్ ఫ్యాన్స్ కి కనుల విందుగా మారింది. రాసి పెట్టుకోండి చివరి 20 నిమిషాల చిత్రం అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించేలా సన్నివేశాలు ఉంటాయి. ప్రతిసారి నేను కాలర్ ఎగరేస్తాను.. ఈసారి అన్న కళ్యాణ్ రామ్ గారు కాలర్ ఎగరేస్తారు అని ఎన్టీఆర్ అనడంతో.. కళ్యాణ్ రామ్ సిగ్గు పడ్డారు. ఎన్టీఆర్ స్వయంగా కళ్యాణ్ రామ్ కాలర్ పట్టుకుని ఎగరేసిన దృశ్యాలకు ఫ్యాన్స్ కేరింతలు కొట్టారు. 

Latest Videos

vuukle one pixel image
click me!