ఒకే ఫ్రేములో జూ.ఎన్టీఆర్, మోక్షజ్ఞ.. నందమూరి సుహాసిని కుమారుడి పెళ్లి వేడుకలో అరుదైన దృశ్యం, ఫొటోస్ ఇవిగో  

First Published | Aug 21, 2023, 6:58 AM IST

నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి జరిగింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, సుహాసిని కుమారుడు హర్ష వివాహ వేడుకలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. 

నందమూరి కుటుంబంలో పెళ్లి సందడి జరిగింది. దివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె, సుహాసిని కుమారుడు హర్ష వివాహ వేడుకలో కుటుంబ సభ్యులంతా సందడి చేశారు. తమ సోదరి కొడుకు పెళ్లి వేడుక కావడంతో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నీ తామై పెళ్లి వేడుకని ముందుండి చూసుకున్నారు. 

ఆదివారం రోజు గచ్చిబౌలిలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు. వివాహ వేడుకకి సినీ రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. 


అయితే ఈ పెళ్లి వేడుకలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ఈ జనరేషన్ నందమూరి సోదరులు ఒకే ఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఒకే దగ్గర చేరి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. 

నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్.. ఈ దృశ్యాలు చూసి పండగ చేసుకుంటున్నారు. తన సోదరులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలసి మోక్షజ్ఞ టైం స్పెండ్ చేయడం ఫ్యాన్స్ కి తెగ సంతోషాన్ని ఇస్తోంది. 

వీళ్లంతా స్టైలిష్ షేర్వాణీ కుర్తా లో రాయల్ గా మెరిశారు. జూ. ఎన్టీఆర్.. తన సోదరులతో ముచ్చటిస్తున్న దృశ్యాలు కూడా వైరల్ గా మారాయి. చాలా కాలం నుంచి ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీతో ముఖ్యంగా బాలయ్య తో సంబంధాలు సరిగా లేవనే రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. 

ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెడుతున్నాడు అంటూ సోషల్ మీడియాలో ఒక ప్రచారమే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, మోక్షజ్ఞ కలసి కనిపించడంతో రూమర్స్ కి చెక్ పడింది. 

ఇక వివాహ వేడుకకి రాజకీయ ప్రముఖులు సైతం హాజరయ్యారు. తెలంగాణ నేత మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు హాజరై వధూవరులని ఆశీర్వదించారు. ఇక చంద్రబాబు సతీసమేతంగా పెళ్లి వేడుకలో సందడి చేశారు. 

బాలయ్య కూడా వివాహ వేడుకకు హాజరయ్యారు. మొత్తంగా సుహాసిని కుమారుడి పెళ్లి వేడుక నందమూరి ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపింది. 

ఈ ఫోటోలని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. నందమూరి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 

Latest Videos

click me!