ఊరించే లిప్స్ తో రష్మిక మందన్న ఫ్లైయింగ్ కిస్సులు.. క్యూట్ సెల్ఫీలతో కట్టిపడేస్తున్ననేషనల్ క్రష్

First Published | Aug 20, 2023, 10:53 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న క్యూట్ సెల్ఫీలతో ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో తరుచూ సందడి చేస్తున్న నేషనల్ క్రష్ లేటెస్ట్ ఫొటోలతో ఆకట్టుకుంటోంది. 
 

‘ఛలో’ సినిమాతో రష్మిక మందన్న (Rashmika Mandanna) టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే తన నటన, అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతకు ముందు కన్నడ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగు సినిమాలతోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. 
 

‘గీతా గోవిందం’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’, ‘పుష్ఫ : ది రైజ్’ వంటి చిత్రాల్లో నటించి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. మరోవైపు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నూ సంపాదించుకొని నేషనల్ క్రష్ గా బిరుదు పొందింది. ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 
 


వెండితెరపై రష్మిక మందన్న వరుస చిత్రాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మ తరుచుగా అభిమానులకు దర్శనమిస్తోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది. అలాగే క్యూట్ ఫొటోలనూ పంచుకుంటూ ఖుషీ చేస్తోంది. 
 

తాజాగా నేషనల్ క్రష్ క్యూట్ సెల్ఫీలను అభిమానులతో పంచుకుంది. బ్యూటీఫుల్ స్మైల్ తో కట్టిపడేసింది. అలాగే ఊరించే లిప్స్ తో ఫ్లయింగ్ కిస్సులు వదులుతూ కుర్ర హృదయాలను కొల్లగొట్టింది. నిషా కళ్లతో గుచ్చేలా చూస్తూ  కలవరపెట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. 

రష్మిక మందన్న ప్రస్తుతం బడా హీరోల సరసన నటిస్తూ కెరీర్ లో అంతకంతకూ ఎదుగుతోంది. బిజీ షెడ్యూల్ కారణంగా కన్నడ భామ.. చిన్న సినిమాలను వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతోంది. దీంతో రష్మిక క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ప్రస్తుతం రష్మిక హిందీలో రూపుదిద్దుకుంటున్న ‘యానిమల్’, తెలుగులోని ‘పుష్ప 2 : ది రూల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగు, తమిళంలో బైలింగ్వుల్ గా తెరకెక్కబోతున్న ‘రెయిన్ బో’లోనూ నటిస్తోంది. ఇక తమిళ స్టార్ ధనుష్ 51 చిత్రం కథనాయికగానూ రష్మిక ఫైనల్ అవడం విశేషం. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. 
 

Latest Videos

click me!