నందమూరి ఫ్యామిలిలో ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రధానంగా హీరోలుగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అన్నదమ్ములు అనే సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకే తరహా కథతో వేర్వేరు చిత్రాల్లో నటించారు. విశేషం ఏంటంటే ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. ఆ చిత్రాలు రెండూ ఒకే ఏడాది కేవలం 20 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఆ చిత్రాలు ఎన్టీఆర్ నటించిన టెంపర్, కళ్యాణ్ రామ్ నటించిన పటాస్.