ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం వార్ 2 ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య జరుగుతున్న భీకర పోరాటాన్ని మీరూ చూసేయండి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం వార్ 2. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వార్ మొదటి భాగం సంచలన విజయం సాధించింది. దీనితో వార్ 2పై ఊహకందని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది విడుదలయ్యే బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాల్లో వార్ 2 ఒకటి. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
25
వార్ 2 ట్రైలర్ వచ్చేసింది
ఆగష్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనితో తాజాగా చిత్ర యూనిట్ మైండ్ బ్లోయింగ్ అనిపించే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ మొత్తం కళ్ళు చెదిరే యాక్షన్ సీన్స్ తో విజువల్ ఫీస్ట్ గా ఉంది. బ్యాగ్రౌండ్ లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వాయిస్ ఓవర్ వినిపిస్తూ ఉంటుంది. స్క్రీన్ పై మాత్రం వీరిద్దరి పోరాటం నెవర్ బిఫోర్ అనే విధంగా సాగుతోంది. ట్రైలర్ ని ఆసక్తికరంగా కట్ చేశారు.
35
ఎవ్వరూ పోరాడలేని యుద్ధం చేసి చూపిస్తా
నేను ప్రమాణం చేస్తున్నాను, నా పేరుని, గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నింటిని వదిలేసి ఒక నీడలా ఉండిపోతాను అంటూ హృతిక్ చెప్పే డైలాగులు అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో తెలియజేస్తున్నాయి. అంటే హృతిక్ అజ్ఞాతంలో ఉంటూ దేశం కోసం పోరాడే వీరుడిగా కనిపిస్తున్నారు. నేను మాట ఇస్తున్నాను, ఎవ్వరూ చేయలేని పనుల్ని.. ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను చేసి చూపిస్తాను అని ఎన్టీఆర్ చెబుతున్న డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.
ట్రైలర్ లో డైలాగులు మొత్తం హృతిక్, ఎన్టీఆర్ మధ్య మాటల యుద్ధంలా కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ యాక్షన్ సన్నివేశాల్లో ఒకరిపై ఒకరు పోరాడుతున్న విధానం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. యాక్షన్ స్టంట్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. విమానాలపై చేస్తున్న యాక్షన్ స్టంట్స్ ఉత్కంఠ పెంచేసేలా ఉన్నాయి. ట్రైలర్ గ్రాఫిక్స్ వర్క్ చాలా బావుంది.
55
గ్లామర్ తో ఆకట్టుకున్న కియారా అద్వానీ
యాక్షన్ మూవీ లవర్స్, ఎన్టీఆర్, హృతిక్ అభిమానులు ఆగష్టు 14న అల్టిమేట్ వార్ కి రెడీ అయిపోవడమే అన్నట్లుగా వార్ 2 ట్రైలర్ ఉంది. ఇక వార్ 2 ట్రైలర్ లో హీరోయిన్ కియారా అద్వానీ కూడా అంటెన్షన్ పొందింది. ఆమె బికినీలో గ్లామర్ ప్రదర్శిస్తూ, హృతిక్ తో రొమాన్స్ చేస్తూ, యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. ఓవరాల్ గా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది అని చెప్పొచ్చు.