జానీ మాస్టర్ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..?

First Published | Sep 21, 2024, 6:32 PM IST

ప్రస్తుతం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ అవుతున్నాడుజానీ మాస్టర్. అత్యాచారం ఆరోపణలతో ఆయన పేరు మీడియాలో మారుమోగుతోంది. కాగా జానీ మాస్టర్ స్టార్ కిరియోగ్రఫర్ గా అవ్వడానికి ఏ హీరోకారణం..? జానీ మాస్టర్ పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా..? 
 

photo-dhe promo

జానీ మాస్టర్ ప్రస్తుతం దేశమంతా వినిపిస్తున్న పేరు. మొన్నటి వరకూ రెండు జాతీయఅవార్డ్ లతో పాటు పాన్ ఇండియా హీరోలకు కొరియోగ్రఫర్ గా జానీ మాస్టర్ పేరు మారు మోగిపోయింది. కాని ఇప్పుడు అత్యాచారం ఆరోపణలతో జానీ మాస్టర్ ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం జరుగుతోంది. 

శోభన్ బాబు అత్తా అని పిలిచే హీరోయిన్ ఎవరో తెలుసా..?
 

జానీ మాస్టర్ టీమ్ లో గతంలో అసిస్టెంట్ గా పనిచేసిన శ్రేష్ఠ వర్మ అనే అమ్మాయి.. తనపై జానీ మాస్టర్ అత్యాచారం చేశాడని.. మతం మార్చుకుంటే పెళ్ళి చేసుకుందాం అని బలవంతం పెడుతున్నాడని.. నార్సింగ్ పోలిస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో జానీ మాస్టర్ పై ఫోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. గోవాలో ఆయన్ను అరెస్ట్ చేశారు. 

కోర్టు జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదంతా సరే.. పాన్ ఇండియా స్టార్ కొరియోగ్రఫర్ గా జానీ మాస్టర్ ఆస్తాయికి ఎలా రాగలిగారు. దానికి ఆయన పడ్డ కష్టం ఎంత..? ఏ హీరో ప్రోత్సాహం ఆయన కు ఎక్కువగా ఉండేది..? జానీ మాస్టర్ కంపోజ్ చేసే పాటకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా..? 

దర్జాగా బతికిన భానుమతి.. చివరి రోజుల్లో....

Latest Videos


జానీమాస్టార్  ప్రస్తుతం ఒక్క పాటకు.. అదికూడా స్టార్ హీరో సినిమా.. పెద్ద సినిమా అయితే 50 లక్షలు తీసుకుంటారట. ఒక సినిమాకు ఆరు పాటలు ఆయనే చేస్తే.. 30 కోట్లు తీసుకోవల్సిందే. కాని ఆ పాటకు ఆయన ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అందుకే ఆయన రెండు జాతీయ అవార్డ్ లు సాధించే స్థాయికి ఎదిగారు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

అయితే చిన్న సినిమాలకు మాత్రం జానీ మాస్టర్ చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడట. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలకు కూడా జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ గా పనిచేస్తారు.. చిన్న సినిమా అయితే పాటకు 10 లక్షలు తీసుకుంటాడట జానీమాస్టర్. 

2009 నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాతో కొరియోగ్రఫర్ గా కెరీర్ ను స్టార్ట్ చేశాడు జానీ మాస్టర్. చాలా సినిమాలకు అసిస్టెంట్ గా పనిచేశాడు. జూయిర్ డాన్సర్ గా చేశాడు. ఆతరువాత చిన్నచిన్నగా తన టాలెంట్ చూపిస్తు.. పాన్ ఇండియా లెవల్ కు ఎదిగాడు. స్టార్ హీరోల సినిమాలు కొరియోగ్రఫీ చేసే స్థాయికి వచ్చాడు. 

నాగార్జునకు నైట్ నిద్ర పట్టాలంటే.. అది తినాల్సిందే

ఇక జానీమాస్టర్ టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు పనిచేశాడు. కాని ఆయన్ను బాగా ఎంకరేజ్ చేసింది మాత్రం రామ్ చరణే అని చెప్పాలి. చరణ్ తన సినిమాలో ఒక్క పాట అయినా జానీ మాస్టర్ తో కంపోజ్ చేయించుకుంటార. ఇలా అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు జానీ మాస్టర్. 

రెండు జాతీయ అవార్డ్ లు సాధించిన జానీ మాస్టర్.. ఆ రెండు తమిళ పాటలకే సాధించాడు. ఇక తెలుగు, తమిళ భాషల్లో చాలా డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించాడు. జనసేన పార్టీలో  చేరి.. స్టార్ క్యాంపేనర్ గా కూడా మారారు. ఇక ప్రస్తుతం ఆయన అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. అయితే జానీ మాస్టర్ ను కావాలనే ఇరికించారి చాలామంది అభిప్రాయం. అసలు నిజాలు తెలియాల్సి ఉంది.

click me!