ఈవారం డబుల్ ఎలిమినేషన్, ఆ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు, ఎవరూ ఉహించని ట్విస్ట్!

First Published | Sep 21, 2024, 5:35 PM IST

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం. ఓ కంటెస్టెంట్ కి రెడ్ కార్డు ఇచ్చిన హోస్ట్ నాగార్జున నేరుగా బయటకు పంపేశాడు. అనూహ్యంగా మరొక కంటెస్టెంట్ ఇంటిని వీడిందట. 
 

Bigg boss telugu 8


బిగ్ బాస్ ఒక రియాలిటీ షో. అక్కడ బిగ్ బాస్ రూల్స్ మాత్రమే పాటించాలి. కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్క్స్ ఆడేటప్పుడు బిగ్ బాస్ నియమాలను అనుసరించాలి. అంతే కాదు వారు ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఎప్పుడు పడుకోవాలి? ఎక్కడ పడుకోవాలి?... అన్నీ బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు. 
 

Bigg boss telugu 8

బిగ్ బాస్ నియమాలను అనుసరించకపోయినా, బిగ్ బాస్ ని ప్రశ్నించినా...  పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. హౌస్లో హద్దులు మీరి ప్రవర్తిస్తే హోస్ట్ నాగార్జున చర్యలు తీసుకుంటాడు. నేరుగా బయటకు పంపే హక్కు కూడా హోస్ట్ కి ఉంటుంది. లేదంటే ఎల్లో, ఆరెంజ్ కార్డ్స్ ఇచ్చి హెచ్చరిస్తాడు. రెడ్ కార్డు ఇస్తే ఎలిమినేట్ అయిపోయినట్లే. 

బిగ్ బాస్ తెలుగు చరిత్రలో నాగార్జున ఎవరికీ రెడ్ కార్డు ఇవ్వలేదు. మొదటిసారి ఆ పరిణామం చోటు చేసుకుంది. కంటెస్టెంట్ అభయ్ నవీన్ ని నాగార్జున నేరుగా ఎలిమినేట్ చేశాడు. రెడ్ కార్డు ఇచ్చి ఇంటి నుండి బయటకు పంపేశాడు. 
 


Bigg boss telugu 8


అభయ్ నవీన్ బిగ్ బాస్ పై కీలక ఆరోపణలు చేశాడు. నిర్ణీత సమయంలో వంట చేసుకోవాలి. అది కూడా ముగ్గురే వంట గదిలో ఫుడ్ ప్రిపేర్ చేయాలని బిగ్ బాస్ నియమం పెట్టాడు. దీనిపై అభయ్ అసహనం వ్యక్తం చేశాడు. అసలు బిగ్ బాస్ కి బుర్ర ఉందా అని ఫైర్ అయ్యాడు. 

అలాగే బిగ్ బాస్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఈయన బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అన్నాడు. నిఖిల్ టీమ్ కి బిగ్ బాస్ ఫేవర్ చేస్తున్నాడన్న అర్థంలో మాట్లాడాడు. ఈ ఆరోపణల నేపథ్యంలో నాగార్జున సీరియస్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో ఆయన చెప్పిందే రూల్. నీకు రెడ్ కార్డు ఇస్తున్నా. నువ్వు ఎలిమినేట్ అన్నాడు. 
 

Bigg boss telugu 8

అభయ్ బ్రతిమిలాడుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అట. స్ట్రాంగ్ కంటెస్టెంట్ యష్మి ఎలిమినేట్ అయ్యిందట. ఊహించని ఈ పరిణామానికి అందరూ షాక్ అయ్యారట. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందట. 

యష్మిను నాగార్జున సీక్రెట్ రూమ్ కి పంపాడట. ఒకటి రెండు వారాలు ఆమె సీక్రెట్ లో రూమ్ లో ఉండాల్సి వస్తుందట. యష్మి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉంది. ఆమె గేమ్స్ లో గట్టిగా పోరాడుతుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో పాటు యష్మిని హౌస్లోకి ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.  
 

Bigg boss telugu 8

సీజన్ 7లో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ కి వెళ్ళాడు. పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు. అశ్వద్ధామ 2.0 అంటూ గౌతమ్ కృష్ణ ఇచ్చిన ఎంట్రీ బాగా ఫేమస్ అయ్యింది. గౌతమ్ కృష్ణ హౌస్లో 10 వారాలకు పైగా ఉన్నాడు. యష్మి సైతం సీక్రెట్ రూమ్ కి వెళుతున్న క్రమంలో ఆమెకు ఫినాలే బెర్త్ ఖాయం అంటున్నారు. 
 

Hariteja


ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీల విషయంలో..  విభిన్నంగా మాజీ కంటెస్టెంట్స్ పై మేకర్స్ దృష్టి పడిందట. గతంలో సక్సెస్ అయిన కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్లో పంపాలని ప్రణాళికలు వేస్తున్నారట. కాగా సీజన్ వన్ లో పాల్గొన్న హరి తేజ, సీజన్ 4 కంటెస్టెంట్ ముక్కు అవినాష్ రావడం పక్కా అంటున్నారు. సీజన్ వన్ ఫైనలిస్ట్ హరితేజను సంప్రదించగా ఆమె ఓకే అన్నారట. హరితేజ 3వ స్థానంలో నిలిచింది. ఈమె ఫైర్ బ్రాండ్ అని చెప్పొచ్చు. 

అలాగే సీజన్ 4లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి రాణించిన జబర్దస్త్ అవినాష్ సైతం మరోసారి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడట. అవినాష్ మంచి ఎంటర్టైనర్. జోక్స్ తో పాటు తన బాడీ లాంగ్వేజ్ తో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తాడు. అవినాష్ పది వారాలకు పైగా హౌస్లో ఉన్నాడు. 
 

వీరిద్దరితో పాటు రోహిణి వస్తుందని టాక్. ఈమె కూడా మాజీ కంటెస్టెంట్. సీజన్ 3లో పాల్గొంది. నటిగా, జబర్దస్త్ కమెడియన్ గా రోహిణి ఫుల్ బిజీ. మరి ఆమె ఆసక్తి చూపుతుందా లేదా అనేది చూడాలి. హరితేజ, అవినాష్ వచ్చినా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!