వెంకటేష్ కి బాలయ్య సడెన్ సర్ప్రైజ్..ఎలా కలిశారో చూడండి

First Published | Sep 21, 2024, 5:52 PM IST

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ.

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ మూవీ. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల తర్వాత వెంకీ, అనిల్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. 

ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. అయితే వెంకీ, అనిల్ మూవీ సెట్ లో చిత్ర యూనిట్ కి నందమూరి బాలకృష్ణ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అనుకోకుండా బాలయ్య తమ చిత్ర షూటింగ్ కి రావడం తో వెంకటేష్, అనిల్ రావిపూడి ఆశ్చర్యపోయారు. 


బాలయ్య రాకతో వాళ్లంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య.. వెంకటేష్, అనిల్ రావిపూడితో సరదాగా ముచ్చటించారు. చిత్ర విశేషాలు అడిగి తెలుసుకున్నారు. ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. 

అనిల్ రావిపూడి చివరగా బాలయ్యతో భగవంత్ కేసరి అనే హిట్ మూవీ తెరకెక్కించారు. ఈ చిత్రంలో అనిల్ రావిపూడి బాలయ్యని డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేశారు. బాలయ్య తొలిసారి తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పిన చిత్రం ఇది. 

Latest Videos

click me!