Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సుబ్బరాజు (Subbaraju) ఫ్యామిలీ జ్ఞానాంబ ఇంటికి వచ్చి జరిగినదంతా చెబుతారు.
దాంతో జ్ఞానాంబ (Jnanaamba) ఆవేశంగా రామచంద్ర కు కాల్ చేసి సుబ్బరాజు ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. మీరిద్దరూ క్షణాల్లో ఇక్కడ ఉండాలని అంటుంది. ఇంటికి వచ్చిన జానకి, రామచంద్రలు (Rama chandra) , జరిగినదంతా నిజంగానే చెప్పేశారు ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటారు.
25
కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. సుబ్బరాజు (Subbaraju ) ఫ్యామిలీ నే వేరే ఒకరికి పెళ్లి విషయంలో పెళ్లి కొడుకు నానమ్మ మాట ఇచ్చిందని వెన్నెల ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెబుతారు. దాంతో జ్ఞానాంబ వాళ్లపై సీరియస్ అవుతూ ఉండగా జానకి, రామచంద్ర (Rama chandra) లు హాయిగా ఊపిరి పీల్చుకుంటారు.
35
ఇక జనాంబ (jnanaamba) , సుబ్బరాజు ను నానా మాటలు అంటూ అవమాన పరుస్తుంది. అదే క్రమంలో మల్లిక భర్త పెళ్ళికొడుకు చొక్కా పట్టుకుని నిలదీస్తాడు. ఆ తర్వాత జ్ఞానాంబ నిశ్చితార్థం ఆగిపోతుందని భయపడుతూ ఉండగా జానకి ఇంతకంటే మంచి సంబంధం వెన్నెల (Vennela) కు దొరుకుతుందని జ్ఞానాంబ ను కన్విన్స్ చేస్తుంది
45
ఇక తర్వాత మల్లిక వాళ్ళ భర్త మల్లికపై (Mallika) ఇంకా పిల్లలను కని పెట్టనందుకు మల్లిక పై ఫన్నీగా సీరియస్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జానకి మా బంధువుల అబ్బాయి ఉన్నాడు తాను చాలా మంచివాడు. అతను మన వెన్నల కు సెట్ అవుతాడు అని దిలీప్ (Dilip) గురించి జ్ఞానాంబ కు చెబుతుంది.
55
ఇక జ్ఞానాంబ (jnanaamba) దానికి సరే అని ఆనందంగా ఒప్పుకుంటుంది. దాంతో జానకి రామచంద్రలు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రేమికుల రోజున రామచంద్ర ' మీరు చదువును కొనసాగిస్తారని నాకు మాట ఇవ్వండి' అని ఈ విషయాన్ని గిఫ్ట్ గా జానకి ను అడుగుతాడు. దాంతో జానకి (Janaki) కోపంగా అక్కడి నుంచి వెళుతుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.