Janaki Kalaganaledu: నీ చదువే నా కొడుకు అవమానానికి కారణం.. మళ్లీ జానకిపై ఫైర్ అవుతున్న జ్ఞానాంబ!

Published : May 04, 2022, 10:59 AM IST

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు  (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 4 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Janaki Kalaganaledu: నీ చదువే నా కొడుకు అవమానానికి కారణం.. మళ్లీ జానకిపై ఫైర్ అవుతున్న జ్ఞానాంబ!

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే ఇంట్లో రామచంద్ర (Ramachandra) పిండివంటలు చేసుకునే వాడికి గౌరవం ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు అని జానకితో అంటాడు. అంతే కాకుండా అక్కడి నుంచి కోపంగా వెళతాడు. ఈ మాటలు గమనించిన జ్ఞానాంబ (Jnanamba) ఎంతో బాధ పడుతుంది.
 

26

అంతేకాకుండా కుటుంబ బాధ్యతల కోసం నీ ప్రాణాన్ని పనంగా పెట్టావ్ అని జ్ఞానాంబ (Jnanamba) తన కొడుకు గురించి తలుచుకొని భాద పడుతుంది. ఒక రకంగా నువ్వు ఈరోజు అవమాన పడడానికి కారణం నేను కూడా అని అనుకుంటుంది. ఈ బాధ అంతటికీ కారణం నేనే అని చెప్పి జానకి (Janaki) జ్ఞానాంబ కాళ్ళు పట్టుకుంటుంది. 
 

36

ఆ తర్వాత జ్ఞానాంబ (Jnanamba) ఈ పరిస్థితులు అన్నిటికీ నువ్వే కారణమని జానకి ను అంటుంది. నా కొడుకుని మీ అన్నయ్య అవమానించడానికి నీ చదువే కారణం అని అంటుంది. దాంతో జానకి (Janaki) కుమిలిపోయి ఏడుస్తుంది. మరోవైపు రామచంద్ర జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. 
 

46

ఇక రామచంద్ర (Ramachandra) దగ్గరికి తన తండ్రి వచ్చి ఈరోజు నువ్వు ఇలా అవమాన పడటానికి కారణం ముమ్మాటికీ నేనే అని ఏడుస్తూ ఉంటాడు. దాంతో రామచంద్ర గోవిందరాజులు జ్ఞానాంబ (Jnanamba) ల కొడుకు అనే గొప్ప హోదాను మీరు నాకు ఇచ్చారు అని తన తండ్రికి ప్రౌడ్ గా చెప్పుకుంటూ తన తండ్రి కి ధైర్యం చెబుతాడు.
 

56

మరోవైపు జానకి (Janaki) ఇంటి పని చేస్తూ ఉండగా..  మల్లిక అక్కడకు వచ్చి నువ్వు ఇంటి పని వంట పని చేయడానికి వీల్లేదు అని అంటుంది. అంతేకాకుండా ఈ విషయంలో జ్ఞానాంబ (Jnanamba) కు జానకి గురించి లేనిపోని మాటలు చెప్పి జ్ఞానాంబ కు జానకి విషయంలో మరింత కోపం ఉండేలా చేస్తుంది.
 

66

ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) మా అమ్మ స్థానంలో ఇంకా ఎవరైనా ఉంటే మీ అన్నయ్య అన్న మాటలకు నీ మొహం కూడా చూసేవారు కాదని జానకి తో అంటాడు. దాంతో జానకి (Janaki) కూడా అవును రామా గారు మీరు అన్నమాట అక్షరాల నిజం అని అంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories