బిగ్ సర్ ప్రైజ్.. నిశ్చితార్థం చేసుకున్న రాకింగ్ రాజేష్, సుజాత.. లవ్ ఎఫైర్ మరో స్థాయికి..

Published : May 04, 2022, 10:49 AM IST

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు.

PREV
16
బిగ్ సర్ ప్రైజ్.. నిశ్చితార్థం చేసుకున్న రాకింగ్ రాజేష్, సుజాత.. లవ్ ఎఫైర్ మరో స్థాయికి..

ప్రతి శుక్రవారం ప్రసారం అయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్.. ఇమ్మాన్యూల్, వర్ష, రాకింగ్ రాజేష్ లాంటి కమెడియన్లు తమ స్కిట్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు. ఒకరిని మించేలా మరొకరు స్కిట్స్ లో ముందుకు వస్తున్నారు. 

26

ఈ శుక్రవారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో విపరీతంగా ఆకట్టుకుంటూ వైరల్ గా మారింది. ఇమ్మాన్యూల్ ఈ సారి కేజిఎఫ్ 2 పేరడీతో వచ్చేశాడు. ఇందులో ఇమ్మాన్యూల్ రాఖీ భాయ్ గా నటించగా.. అధీర పాత్రలో భాస్కర్ గెటప్ విశేషంగా ఆకట్టుకుంటోంది. నవ్వులు పూయిస్తోంది. ఇక ఇమ్మాన్యూల్ కెజిఎఫ్ 2 ని తనదైన శైలిలో కూనీ చేశాడు. వర్ష హీరోయిన్ గా కనిపించింది. 

36

బుల్లెట్ భాస్కర్ గెటప్ చూసి.. నువ్వెవరో నాకు తెలుసు.. రాకేష్ మాస్టర్ కదా.. అంటూ ఇమ్మాన్యూల్ నవ్వులు పూయిస్తున్నాడు. అలాగే నూకరాజు అండ్ గ్యాంగ్ దేవకన్యల స్కిట్ తో ముందుకు వచ్చారు. అది కూడా మంచి హాస్యం పండిస్తోంది. ఇక సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్ విభిన్నమైన స్కిట్ తో రెడీ అయ్యారు. ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ కామెడీగా ఉంది. 

46

ఆటో రాంప్రసాద్ లేడీ గెటప్ లో హీరోయిన్ ఇంద్రజ లాగా డైలాగులు కొట్టాడు. వీళ్ళు శ్రీదేవి డ్రామా కంపెనీ పేరడీ చేశారు. జడ్జిగా వచ్చిన పూర్ణ.. సుధీర్ చాలా స్మార్ట్ గా ఉన్నాడని పొగుడుతుంది. దీనితో పక్కనే ఉన్న రష్మీ అసూయ పడుతూ కనిపిస్తుంది. 

56

ఇక ఈ ప్రోమోలో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. జబర్దస్త్ లవ్ జోడిగా ఉన్న మరో జంట రాకింగ్ రాజేష్, సుజాత షోలోనే నిశ్చితార్థం చేసుకున్నారు. వాళ్లిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయాన్ని వాళ్ళు కూడా ప్రకటించుకున్నారు. 

66

ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా వెలిగిపోతున్నారు. రాజేష్ సుజాతకి రింగ్ తొడుగుతూ కనిపించాడు. ఈ దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. నిశ్చితార్థం తరహాలో రింగు తొడిగిన రాజేష్.. సుజాతతో నీ పెళ్లి అయిపోయిందిగా.. అని చెప్పడం కాస్త గందరగోళంగా ఉంది. ఫుల్ ఎపిసోడ్ లో దీనిపై క్లారిటీ రానుంది. అయితే స్కిట్ లో భాగంగానే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. 6వ తేదీ పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. 
 

click me!

Recommended Stories