Published : May 04, 2022, 10:51 AM ISTUpdated : May 04, 2022, 10:52 AM IST
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రియమణి లేటెస్ట్ ఫొటోషూట్లతో పరువాల విందు చేస్తోంది. బుల్లితెరపై జడ్జీగా సందడి చేస్తున్న ఈ ముదురు భామా.. సోషల్ మీడియాలోనూ గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేస్తూ మెస్మరైజ్ చేస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి బిగ్ స్క్రీన్ పై ఎంతగా ప్రేక్షకులను అలరించిందో.. బుల్లితెరపైనా అదే రేంజ్ లో ఆకట్టుకుంటోంది. హీరోయిన్ గా స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ ఇటు రియాలిటీషోలకూ జడ్జీగా వ్యవహరిస్తోంది.
26
ప్రస్తుతం ప్రియమణి ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్గేస్ట్ డాన్స్ రియాలిటీ షో ‘Dhee 14’ సీజన్ కు జడ్జీగా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రస్తుం పూర్ణ (Poorna) కూడా జడ్జీగా కొనసాగుతున్నారు. మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్ రన్ చేస్తున్నఢీ14 రియాలిటీ షో 580 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.
36
ప్రియమణి, పూర్ణ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షోకు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మేల్ యాంకర్స్ గా, రష్మి గౌతమ్ ఫీమేల్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రతి డాన్స్ షోకు మధ్య వీరి కామెడీ కానవర్జేషన్, స్కిట్ కూడా షోకు హైలెట్ గా నిలుస్తున్నాయి.
46
ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఈ షో లేటెస్ట్ ఎపిసోడ్ కోసం ప్రియమణి మతిపోయే అవుట్ ఫిట్ లో హాజరైంది. ఈ సందర్భంగా ఫొటోషూట్ కూడా నిర్వహించింది. ఆ ఫొటోలను తాజాగా తన అభిమానులతో ఇన్ స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
56
ట్రెండీ గౌన్ లో ప్రియమణి అందాల విందు చేస్తోంది. స్లీవ్ లెస్ గ్లామర్ తో నెటిజన్లను ఆకర్షిస్తోంది. మతిపోయేలా ఫొటో పోజులతో కుర్రాళ్లను తనవైపు తిప్పకుంటోందీ బ్యూటీ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోషూట్లతో దర్శనమిస్తూ తన క్రేజ్ పెంచుకుంటోంది.
66
మరోవైపు కొన్నేండ్ల తరువాత ప్రియమణి సినిమాల జోరు పెంచింది. ఏకంగా ఆరు, ఏడే చిత్రాల్లో నటిస్తూ బిజీయేస్ట్ హీరోయిన్ అనిపించుకుంటోంది. చివరిగా ‘భామా కలాపం’తో ఓటీటీలో సందడి చేసింది. ఈ చిత్రానికి ఆడియెన్స్ ను మంచి రెస్పాన్సే వచ్చింది.