దానికి నువ్వు ఏ సమాధానం ఇస్తావు?నీకు సాయంత్రం కల్లా టైం ఇస్తున్నాను. నువ్వే తేల్చుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జెస్సి వాళ్ళ అమ్మానాన్న, జెస్సిని, నీకు కడుపు కారణమైన మనిషి ఎవరు అని అడుగుతారు. జెస్సి,మనసులో ఇప్పుడు అఖిలే అని చెప్తే అఖిల్ చనిపోతాడు అని అన్నాడు.కొన్ని రోజులు ఆగి చెబుదాము అని అనుకుని, నాకు ఇంకొంచెం సమయం కావాలి అని అంటుంది. మాకు విషయం ఇప్పుడే తెలియాలి.