ఆ తర్వాత ఇంటికి వచ్చిన వారికి భోజనాలు వడ్డీస్తూ ఉంటారు. ఆ తర్వాత మల్లిక గర్భవతి అన్న మాటని అడ్డుపెట్టుకొని జ్ఞానాంబ ముందు నటిస్తూ ఉంటుంది. అప్పుడు మల్లికా కుర్చీ మీద కూర్చోగా జానకి అన్నం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు కావాలనే మల్లికను అందరి ముందు జానకిని అవమానించే విధంగా మాట్లాడుతుంది. వెంటనే గోవిందరాజులు,మల్లికకు తగిన విధంగా బుద్ధి చెబుతాడు. ఆ తర్వాత అఖిల్ జరిగిన విషయాన్ని తలుచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అఖిల్ ఆలోచిస్తూ కూర కలుపుకోకుండా ఉత్త అన్నం తింటూ ఉంటాడు. ఇప్పుడు జానకి, అఖిల్ కంగారుని గమనించి ఏదో జరిగింది వెంటనే తెలుసుకోవాలి అని అంటుంది అనుకుంటూ ఉంటుంది.