Maa Behen
త్రిప్తి డిమ్రి, మాధురి దీక్షిత్, రవి కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. చిన్న పట్టణం నేపథ్యంలో సాగే ఈ మూవీకి ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. విచిత్రమైన కథనం, ఆసక్తికరమైన పాత్రలు సినిమాపై అంచనాలు పెంచాయి.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 4
Dhurandhar: The Revenge
2025లో వచ్చిన స్పై థ్రిల్లర్‌కు ఇది సీక్వెల్. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ ‘Raw & Undekha’ వెర్షన్ ఇప్పటికే విదేశాల్లో స్ట్రీమింగ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఇండియాలో డిజిటల్ ప్రీమియర్‌కు వస్తోంది.
ఎక్కడ చూడాలి: Netflix, JioHotstar
రిలీజ్ డేట్: జూన్ 4
Office Romance
జెన్నిఫర్ లోపెజ్, బ్రెట్ గోల్డ్‌స్టీన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ. ఆఫీస్‌లో సీక్రెట్ రిలేషన్‌షిప్ వల్ల ఇద్దరు వర్కహాలిక్స్ జీవితాల్లో వచ్చే గందరగోళం కథాంశంగా ఉంటుంది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 5
Mexico 86
1986 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను మెక్సికో ఎలా నిర్వహించిందన్న అంశం చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. డియాగో లూనా, డేనియల్ గిమెనెజ్ కాచో, కార్లా సౌజా కీలక పాత్రల్లో నటించారు.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 5
Teach You A Lesson
పాఠశాలల్లో క్రమశిక్షణ పూర్తిగా కూలిపోయిన పరిస్థితుల్లో, విచిత్రమైన ఇన్‌స్పెక్టర్లు ఎంట్రీ ఇచ్చి వ్యవస్థను ఎలా మార్చారన్న కథతో ఈ K-డ్రామా రూపొందింది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 5
The Marked Woman
ఒక మహిళ షిప్పింగ్ కంటైనర్‌లో గుర్తు తెలియని స్థితిలో కనిపించడంతో కథ మొదలవుతుంది. ఆమె ఎవరు? ఎందుకు చంపాలని చూస్తున్నారు? అనే మిస్టరీ చుట్టూ సిరీస్ తిరుగుతుంది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 5
29
విధు, ప్రీతి అస్రాని నటించిన తమిళ రొమాంటిక్ డ్రామా. థియేటర్లలో మోస్తరు విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు OTTలో పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది.
ఎక్కడ చూడాలి: Netflix
రిలీజ్ డేట్: జూన్ 5