ఇండియన్ సినిమాకి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన చిత్రం బాహుబలి. బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలతో తెలుగు సినిమా మార్కెట్ స్వరూపమే మారిపోయింది. ఈ క్రెడిట్ అంతా రాజమౌళిదే. తన విజన్ తో రాజమౌళి బాహుబలి చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంలా చిత్రీకరించారు. ప్రభాస్ అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలిగా డ్యూయెల్ రోల్ లో నటించారు. దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, శివగామిగా రమ్యకృష్ణ నటించారు.