స్టార్‌ డైరెక్టర్‌తో పెళ్లికి రెడీ అయిన భానుప్రియ.. మధ్యలో చెడగొట్టింది ఎవరో తెలుసా?

Published : Jul 20, 2025, 05:47 PM IST

సీనియర్‌ నటి భానుప్రియ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె ఓ స్టార్‌ డైరెక్టర్‌ని వివాహం చేసుకోవాలనుకుంది. మరి అది ఎలా ఆగిపోయిందనేది తెలుసుకుందాం. 

PREV
16
`సితార`తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన భానుప్రియ

భానుప్రియ క్లాసికల్‌ మూవీస్‌తో ఎక్కువగా అలరించిన నటి. ఒకప్పుడు టాలీవుడ్‌ బిగ్‌ స్టార్స్ అందరితోనూ కలిసి నటించింది. అడపాదడపా గ్లామర్‌ రోల్స్ చేసినా చాలా వరకు ట్రెడిషనల్‌ లుక్‌లోనే కనిపించి అలరించింది.

 హుందాతనంతో కూడిన పాత్రలు చేసి మెప్పించింది. తమిళంలో హీరోయిన్‌ గా పరిచయం అయిన భానుప్రియని `సితార` సినిమా కోసం తెలుగులోకి తీసుకొచ్చారు దర్శకుడు వంశీ.

 చాలా మంది భానుప్రియని చూసి రిజెక్ట్ చేసినా, తాను మాత్రం ఆమెని నమ్మారు. పట్టుపట్టి ఆమెని తెలుగుకి పరిచయం చేశారు. స్టార్‌ హీరోయిన్‌ని చేశారు.

26
`సితార`తోనే స్టార్‌ అయిపోయిన భానుప్రియ

తొలి చిత్రం `సితార`తోనే ఆకట్టుకుంది భానుప్రియ.  అదే సమయంలో తన అద్భుతమైన నటనతో మెప్పించింది. తొలి చిత్రంతోనే తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. బిజీగా రాణించింది. 

ఇక వరుసగా `అన్వేషణ`, `విజేత`, `దొంగమొగుడు`, `స్వర్ణకమలం`, `ఖైదీ నెం 786`, `స్టేట్‌ రౌడీ` వంటి వందల చిత్రాల్లో నటించింది. ఏఎన్నార్‌, కృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, బాలకృష్ణ, సుమన్‌, రాజేంద్రప్రసాద్‌ వంటి హీరోలకు జోడీగా నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది భానుప్రియ.

36
భానుప్రియకి లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు వంశీ

అయితే తెలుగులో భానుప్రియకి లైఫ్‌ ఇచ్చింది దర్శకుడు వంశీ. ఆమెని తెలుగులోకి పరిచయం చేయడమే కాదు, తనకు అవసరమైనప్పుడు కెరీర్‌ పరంగా పుష్‌ ఇచ్చారు. ఆమెని గ్లామర్‌గా చూపించింది ఆయనే, క్లాసికల్ డాన్స్ గా ఆవిష్కరించింది ఆయనే. 

కెరీర్‌ని మలుపు తిప్పడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. దీంతో వీరి మధ్య మంచి అనుబంధం ఉంది. అయితే ఆ అనుబంధంతో భానుప్రియని పెళ్లి చేసుకోవాలనుకున్నారట దర్శకుడు వంశీ.

46
భానుప్రియతో రెండో పెళ్లికి రెడీ అయిన దర్శకుడు వంశీ

దర్శకుడు వంశీకి ఆల్‌రెడీ పెళ్లైంది, పిల్లలు కూడా ఉన్నారు. అయినా భానుప్రియతో రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. అంతేకాదు ఏకంగా భానుప్రియ పెద్ద వాళ్లతో మాట్లాడారు. ఇంట్లో ఈ విషయాన్ని చెప్పింది భానుప్రియ. 

దీంతో పేరెంట్స్ ఒప్పుకోలేదట. ముఖ్యంగా భానుప్రియ అమ్మ మ్యారేజ్‌ చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది. భాను ప్రియని చాలా కట్టడి చేసిందట.

56
వంశీతో పెళ్లికి నో చెప్పిన భానుప్రియ అమ్మ

`వంశీకి ఆల్‌రెడీ మ్యారేజ్‌ అయ్యింది. పిల్లలు ఉన్నారు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడమేంటి` అని మందలించిందట భానుప్రియ మదర్‌. 

ఆమె బలంగా ఈ పెళ్లిని వ్యతిరేకించడంతో అటు భానుప్రియా, ఇటు వంశీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అమ్మ కారణంగానే ఆ మ్యారేజ్‌ ఆలోచన విరమించుకున్నట్టు చెప్పింది భానుప్రియ. 

అమ్మ తనని అన్ని విషయాల్లో ప్రొటెక్ట్ చేసేదని వెల్లడించింది భానుప్రియ. ఈ విషయాన్ని ఐడ్రీమ్‌ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భానుప్రియ తెలిపింది. అలా భానుప్రియతో దర్శకుడు వంశీ రెండో పెళ్లి వ్యవహారం క్లోజ్‌ అయ్యింది.

66
సినిమాకి సంబంధం లేని వ్యక్తితో భానుప్రియ పెళ్లి

ఆ తర్వాత భానుప్రియ.. 1998లో డిజిటల్‌ గ్రాఫిక్ ఇంజనీర్ ఆదర్శ్‌ కౌశల్‌ని వివాహం చేసుకుంది. కాలిఫోర్నియాలో వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి కూతురు అభినయ ఉంది.

 భానుప్రియ భర్త ఆదర్శ్‌ 2018లో గుండెపోటుతో మరణించారు. దీంతో ఆమె ఇప్పుడు ఒంటరిగానే ఉంటుంది. తన కూతురుతో కలిసి చెన్నైలో ఉంటున్నట్టు తెలుస్తోంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories