బిగ్ బాస్ పై మాజీ విన్నర్ తీవ్ర వ్యాఖ్యలు, నవదీప్ ను టార్గెట్ చేసిన కౌశల్ మంద

Published : Aug 27, 2025, 10:02 AM IST

బిగ్ బాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు మాజీ విన్నర్ కౌశల్ మంద. తాను విన్నర్ ను అవ్వడం బిగ్ బాస్ టీమ్ కు ఇష్టం లేదు అన్నారు. అతను అసలు ఎందుకు అలా అన్నాడంటే?

PREV
15

బిగ్ బాస్ లోకి కామన్ ఆడియన్స్

తెలుగు బుల్లితెరపై ప్రేక్షకులను మళ్లీ అలరించేందుకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రెడీ అవుతోంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 5న కాని, 7న కానీ కొత్త సీజన్ లాంఛనంగా మొదలయ్యే అవకాశముంది. ఈ సీజన్‌లో ప్రత్యేకతగా, సెలబ్రిటీ కంటెస్టెంట్లతో పాటు కామన్ ఆడియెన్స్‌కు కూడా అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంగా బిగ్ బాస్ టీమ్ ‘అగ్ని పరీక్ష’ అనే కొత్త ఫేస్‌ను ప్రారంభించింది.

DID YOU KNOW ?
సెప్టెంబర్ లో బిగ్ బాస్ ?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 సెప్టెంబర్ లో స్టార్ట్ కాబోతోంది. వచ్చే నెల 5న కానీ, 7న కానీ ఈ షో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.
25

జడ్జిలకు అగ్నిపరీక్ష

వేలాది మంది కామన్ పీపుల్ ఈ అగ్ని పరీక్ష కోసం అప్లై చేయగా, మొదట 45 మందిని ఎంపిక చేశారు. వారి ప్రదర్శన ఆధారంగా కేవలం ఐదుగురిని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించనున్నారు. ఈ ఎంపిక ప్రక్రియను మాజీ విన్నర్లు అభిజిత్‌, బిందు మాధవి తో పాటు మాజీ కంటెస్టెంట్ నవదీప్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాంటెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. బిగ్ బాస్ ను మించిన ఉత్కంఠ అగ్నిపరీక్షలో నెలకొంది.

35

బిగ్ బాస్ పై మాజీ విన్నర్ తీవ్ర వ్యాఖ్యలు

అయితే ఈ అగ్ని పరీక్ష ఫార్మాట్‌పై బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన విజయం బిగ్ బాస్ టీమ్‌కు ఇష్టపడలేదని, కేవలం ప్రేక్షకుల మద్దతుతోనే తనకు విజేతగా ప్రకటించినట్టు తెలిపారు. ఈ సందర్భంలో కౌశల్ మాట్లాడుతూ: “నేను గెలవడం బిగ్ బాస్ టీమ్‌కు అస్సలు ఇష్టం లేదు. ప్రేక్షకుల వల్లే నన్ను విన్నర్ చేశారు. అందుకే అప్పటి నుంచి నన్ను ఎప్పుడూ హౌస్‌కి పిలవలేదు. సాధారణంగా విన్నర్‌ను స్టేజ్ మీద చెయ్యి పట్టుకొని ప్రకటిస్తారు. కానీ నన్ను మాత్రం స్క్రీన్ మీదే ప్రకటించారు. దాంతోనే అర్థం చేసుకోవచ్చు – నా విజయం వారికి ఇష్టమే కాదు” అని అన్నారు.

45

సోషల్ మీడియాలో రచ్చ

బిగ్ బాస్‌లో ఇతర విన్నర్లు, మాజీ కంటెస్టెంట్లు తరువాతి సీజన్లలో గెస్ట్‌లుగా కనిపించినా, కౌశల్ మాత్రం ఎప్పుడూ దూరంగా ఉన్నాడు. దీనిపై ఇప్పటికే అభిమానుల మధ్య చర్చ నడుస్తుండగా, ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చాయి.ఇదిలా ఉండగా, బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష కాంటెస్ట్‌లో విజేతల ఎంపికలో పారదర్శకత ఉందా అన్న అంశంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. మరి ఈ వ్యాఖ్యలకు బిగ్ బాస్ టీమ్ నుంచి స్పందన వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

55

నవదీప్ పై షాకింగ్ కామెంట్స్

ఇక బిగ్ బాస్ అగ్నిపరీక్ష పై కూడా కౌశల్ స్పందించారు. ''బిగ్‌బాస్‌-9 హౌస్‌లోకి కామన్‌ ఆడియన్స్‌ను పంపేందుకు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. కానీ, జడ్జీలుగా వారిని తీసుకోవడంపై నాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అభిజిత్ బిగ్‌బాస్- 4 విజేత కాబట్టి అతను పర్వాలేదు. బిందు మాధవి ఓటీటీ విజేత కాబట్టి ఓకే. మరి నవదీప్ ఎందుకు? అతను‌ సీజన్‌-1 సమయంలో మూడో స్థానంలో నిలిచాడు. ఇలా ఓడిపోయిన వ్యక్తిని కాకుండా మొదట సీజన్ లో విన్న ర్ గా నిలిచిన‌ శివబాలాజీని జడ్జీగా తీసుకుని ఉండుంటే బాగుండేది. అలా చేయడం వల్ల బిగ్ బాస్ విన్నర్స్‌కు మంచి గుర్తింపు ఇచ్చినట్లు ఉండేది’

Read more Photos on
click me!

Recommended Stories