కృష్ణంరాజుని నన్ను చూసి హీరోయిన్ ఓర్వలేకపోయింది.. అతిచేసింది కాబట్టే వాయించా

Published : Jun 30, 2024, 08:35 PM IST

సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ టాలీవుడ్ లెజెండ్రీ హీరోయిన్లలో ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు లాంటి అగ్ర హీరోలందరితో జయసుధ నటించారు. హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడూ విభేదాలు తలెత్తడం చూస్తూనే ఉన్నాం.

PREV
16
కృష్ణంరాజుని నన్ను చూసి హీరోయిన్ ఓర్వలేకపోయింది.. అతిచేసింది కాబట్టే వాయించా

సహజనటిగా గుర్తింపు తెచ్చుకున్న జయసుధ టాలీవుడ్ లెజెండ్రీ హీరోయిన్లలో ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు లాంటి అగ్ర హీరోలందరితో జయసుధ నటించారు. హీరోయిన్ల మధ్య అప్పుడప్పుడూ విభేదాలు తలెత్తడం చూస్తూనే ఉన్నాం. కొందరు హీరోయిన్లు ఫ్రెండ్లీగా ఉంటారు. కొందరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైరం ఉంటుంది. 

26

ఈ వైఖరి అప్పట్లో కూడా ఉండేది. సహజనటి జయసుధ చెప్పిన మాటలు వింటే ఆ విషయం అర్థం అవుతుంది. జయసుధ, రెబల్ స్టార్ కృష్ణం రాజు వెండితెరపై సూపర్ హిట్ జోడి. ఈ విషయం అందరికి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఎన్నో చిత్రాల్లో జంటగా నటించారు. 

 

36
Jayasudha

దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణంరాజు నటించిన కటకటాల రుద్రయ్య చిత్రంలో జయసుధ, జయచిత్ర ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. జయచిత్రకి ఎవరైనా అందంగా కనిపించినా, కాస్త ఉత్సాహంగా కనిపించినా అసూయపడేది. ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించేది. 

46

కృష్ణంరాజు గారు చాలా హైట్ ఉంటారు. ఆయనతో నటించేటప్పుడు సౌకర్యంగా ఉండడం కోసం, సరిజోడిలా అనిపించడం కోసం నేను హై హీల్స్ వేసుకునేదాన్ని. మేమిద్దరం మంచి పెయిర్ గా కనిపించడం ఆమెకి నచ్చేది కాదు. దీనితో జయసుధని హై హీల్స్ తీసేయమని చెప్పండి అంటూ డామినేట్ చేయడానికి ప్రయత్నించేది. 

56

నేనెందుకు ఊరుకుంటాను.. అలా అతిగా బిహేవ్ చేస్తే నాకు నచ్చదు. అందుకే ఆమెని నేను పట్టించుకునేదాన్ని కాదు. ఓ సన్నివేశంలో మేమిద్దరం కొట్టుకునే సన్నివేశం ఉంది. దాసరి నారాయణరావు గారు కట్ చెప్పినా కొట్టుకుంటూనే ఉన్నాము. అయితే అది ఆమెపై కోపంతో కాదు. కట్ చెప్పినప్పుడు వినిపించలేదు. 

66

జయచిత్రని కోపంతో కొట్టినట్లు క్రియేట్ చేశారు. ఆమెతో నాకు విభేదాలు ఉన్నాయి కానీ కొట్టుకునే వరకు వెళ్ళలేదు అని జయసుధ తెలిపింది. జయప్రద, శ్రీదేవి లాంటి వారు గ్లామర్ తో డామినేట్ చేస్తున్నప్పటికీ..నా పంథాలో నేను నటించుకుంటూ వెళ్లినట్లు జయసుధ పేర్కొన్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories