శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Published : Jul 05, 2024, 04:28 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

PREV
16
శ్రీదేవికి ఎంత అహంకారమో తెలుసా.. సారీ, ఇవన్నీ నిజాలు..లెజెండ్రీ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

అతిలోక సుందరి శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత ఇండియా మొత్తం ఎంత క్రేజ్ సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇలా అందరు హీరోలతో శ్రీదేవి ఆడిపాడింది. 

26

శ్రీదేవికి అప్పట్లో టాలీవుడ్ లో జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్లతో కాంపిటీషన్ ఉండేది. శ్రీదేవి ఎక్కువగా గ్లామర్ పాత్రల్లో కనిపించేది. జయసుధ, జయప్రద నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసేవారు. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇగో ఫీలింగ్స్ సహజం. 

36

లెజెండ్రీ నటి జయప్రద ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. నేను శ్రీదేవి చాలా చిత్రాల్లో కలసి నటించాం. అక్కా చెల్లెళ్ళ లాగా నటిస్తే నిజంగానే అక్కా చెల్లెల్లు అనేంత అద్భుతంగా నటించారు అని అంతా ప్రశంసించేవారు. కానీ కట్ చెప్పిన తర్వాత మా మధ్య ఒక్క మాట కూడా ఉండేది కాదు. ఆమెది ఒక దారి నాది ఒక దారి. 

46
Jayaprada

షూటింగ్ లొకేషన్ లో నాకు దూరంగా శ్రీదేవి చైర్ వేయించుకునేది. సారీ, నేను నిజాలు మాట్లాడుతున్నా.. శ్రీదేవికి అహంకారం ఎక్కువ. ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడాడు. ఎంతటి వారు వచ్చినా కాలుమీద కాలు వేసుకుని కూర్చునేది. మా మధ్యన ఎలాంటి గొడవలు లేవు. 

56
Jayaprada

కానీ శ్రీదేవి ప్రవర్తన నాకు నచ్చేది కాదు. మా ఇద్దరి మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండాల్సింది. కానీ అది లేదు. బయట నేను ఎవరో తెలియనట్లే ప్రవర్తించేది అని జయప్రద అన్నారు. 

66

కానీ ఏమైనప్పటికి ఒక నటిగా శ్రీదేవిని నేను గౌరవిస్తాను. శ్రీదేవి తాను గొప్ప నటిని అనే అహంకారంతో ప్రతి సమాయంలో అలాగే ప్రవర్తించేది. కానీ నేను ఆఫీస్ బాయ్ తో కూడా నార్మల్ గా మాట్లాడతాను. శ్రీదేవికి అది ఎందుకో అలవాటు కాలేదు. బహుశా ఆమె గ్లామర్ రోల్స్ ఎక్కువ చేస్తోంది అనే గర్వం కావచ్చు అని జయప్రద అన్నారు. 

click me!

Recommended Stories