బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?

Published : Jul 05, 2024, 04:11 PM IST

శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో స్టార్‌ యాంకర్‌గా రాణిస్తుంది. సుమ, రష్మిని మించి ఆమె షోస్‌ చేస్తూ ఆకట్టుకుంటుంది. తనదైన యాంకరింగ్‌తో అలరిస్తుంది. వినోదాన్ని పంచుతుంది.   

PREV
110
బ్లాక్‌ డెవిల్‌ లుక్‌లో శ్రీముఖి హల్‌చల్‌.. బుల్లితెర రాములమ్మని ఇలా ఎప్పుడైనా చూశారా?
pics-sreemukhi insta

`పటాస్‌` షోతో పాపులర్‌ అయ్యింది శ్రీముఖి. ఆ తర్వాత ఒకటి అర షోస్‌తో కెరీర్‌ని నెట్టుకొచ్చింది. ఒకానొక దశలో ఆమె జీరో అయిపోయింది. ఖాళీగా ఉంటూ సోషల్‌ మీడియాలో హడావుడి చేసింది. రీల్స్, వీడియోలు, ఫోటోలతో తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. కానీ ఆ వెంటనే బౌన్స్ బ్యాక్‌ అనేలా ఆమె భారీ ప్లానింగ్‌తో ముందుకు రావడం విశేషం.  
 

210
pics-sreemukhi insta

ఏమీ లేని స్థితి నుంచి వరుసగా నాలుగైదు షోస్‌ చేసే స్థాయికి ఎదిగింది. అంతగా కష్టపడింది. తన టాలెంట్‌కి పని చెప్పి షోలని రక్తికట్టించింది. వరుసగా ఆఫర్లు అందుకుంది. `సరిగమప`, `కామెడీ స్టార్స్`, `సారంగదరియా`, `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌`, `నీతోనే డాన్స్`, `ఆదివారం స్టార్‌ మాపరివార్‌`, `బిబీ జోడీ` వంటి షోస్‌కి యాంకర్‌గా చేసింది. 
 

310
pics-sreemukhi insta

వీటితోపాటు పండగలకు ప్రత్యేక ఈవెంట్లకి తనే బెస్ట్ ఆప్షన్‌. ఈటీవీ, స్టార్‌ మా, జెమినీ, జీ తెలుగు ఇలా ఏ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌ అయినా, శ్రీముఖి ఉండాల్సిందే అనేట్టుగా మారిపోయింది. ఆయా షోస్‌ జనాలను బాగా ఆదరణ పొందడంతో శ్రీముఖికి డిమాండ్‌ పెరిగింది. 

410
pics-sreemukhi insta

ఒక్కో షో పెంచుకుంటూ వస్తుంది శ్రీముఖి. డామినేటింగ్‌ యాటిట్యూడ్‌, చలాకీతనం, సెటైర్లని స్పోర్టీవ్‌గా తీసుకోవడం, పులిహోర కలపడం ఇలా ఏదైనా చేయగలదు ఈ బుల్లితెర రాములమ్మ. అందుకే బాగా సక్సెస్‌ అయ్యింది.
 

510
pics-sreemukhi insta

పైగా అందానికి అందం. ఇవన్నీ తోడు కావడంతో ఆమె యాంకరింగ్‌ చేసిన షోస్‌ బాగా రక్తికడుతున్నాయి. మంచి రేటింగ్‌ వస్తున్నాయి. ఇలా శ్రీముఖికి డిమాండ్‌ పెరుగుతుంది. అన్ని విషయాల్లో కంఫర్ట్ గా ఉండటం అనేది ఆమెకి బాగా ప్లస్‌ అయ్యింది. అదే ఆమెని స్టార్‌ యాంకర్‌ని చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 
 

610
pics-sreemukhi insta

ఇటీవల కొత్త షో కూడా ప్రారంభమైంది. `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` అనే షోని ప్రారంభించారు. దీనికి యాంకర్‌గా శ్రీముఖి చేస్తుండటం విశేషమైతే, ఇందులో మరో యాంకర్‌ అనసూయ జడ్జ్ గా ఉండటం మరో విశేషం. ఈ షోతోనూ శ్రీముఖి చేసే రచ్చ వేరే లెవల్‌ అని చెప్పొచ్చు. 

710
pics-sreemukhi insta

ఇలా టాలెంట్‌తో మెప్పించే శ్రీముఖి. అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే ఆమె అందం కూడా ఆమెకి అవకాశాలను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పాలి. తన షోస్‌ కోసం ఆమె ట్రెండీ వేర్‌లో చేసే ఫోటో షూట్లు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

810
pics-sreemukhi insta

తెలుగుస్టార్‌ యాంకర్‌ శ్రీముఖి గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆమె డిఫరెంట్‌ పోజులతో కనువిందు చేస్తుంది. ప్రతి వారం తన షోస్‌ కోసం ఆమె ఫోటో షూట్‌ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకర్షిస్తుంది. వారికి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. తీరైన ట్రెండీ వేర్స్ ధరించి పోజులివ్వగా అవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 

910
pics-sreemukhi insta

శ్రీముఖి ప్రస్తుతం సరికొత్త లుక్‌లో కనిపిస్తుంది. ఆమె బ్లాక్‌ డ్రెస్‌లో మెరిసిపోతుంది. టాప్‌ డిజైనింగ్‌తో కూడా బ్లాక్‌ ఫ్రాక్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. దీంతో ఈ బ్లాక్‌ ఫ్రాక్‌లో శ్రీముఖి అందం రెట్టింపు కావడం విశేషం. 

1010
pics-sreemukhi insta

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ, బ్లాక్‌ డెవిల్‌ అంటున్నారు. బ్లాక్‌ క్యాట్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. తమకి పెద్ద క్రష్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖి ఫోటోలను వైరల్‌ చేస్తూ రచ్చ చేస్తున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories