ఇండియన్‌ ఐడల్‌లో రిషికపూర్‌ని గుర్తు చేసుకున్న జయప్రద..శ్రీదేవితో అస్సలు పడేది కాదంటూ ఎమెషనల్‌!

Published : Apr 23, 2021, 01:32 PM ISTUpdated : Apr 23, 2021, 01:33 PM IST

అతిలోక సుందరి శ్రీదేవితో తనకు అస్సలు పడేది కాదట. తాజాగా `ఇండియన్‌ ఐడల్‌ 12`లో అలనాటి నటి జయప్రద వెల్లడించింది. రిషికపూర్‌ని గుర్తు చేసుకుని ఎమోషనల్‌ అయ్యింది. తాజాగా ఆ  ప్రోమో వైరల్‌ అవుతుంది.

PREV
113
ఇండియన్‌ ఐడల్‌లో రిషికపూర్‌ని గుర్తు చేసుకున్న జయప్రద..శ్రీదేవితో అస్సలు పడేది కాదంటూ ఎమెషనల్‌!
తెలుగు, తమిళం, హిందీలో అగ్ర నటిగా రాణించిన జయప్రద తాజాగా హిందీలో ప్రసారమయ్యే `ఇండియన్‌ ఐడల్‌ 12` సీజన్‌ షోలో పాల్గొంది. దేశంలోనే అత్యంత ప్రతిభావంతులైన సింగర్స్ ని వెలికితీసే షో `ఇండియన్‌ఐడల్‌` అనే విషయం తెలిసిందే.

213
ఈ వారంతంలో ప్రసారమయ్యే షోలో జయప్రద పాల్గొని సందడి చేశారు. ఈ లెజెండరీ నటిగా షో జడ్జ్ లు, సింగర్స్ గ్రాండ్‌గా వెల్‌ కమ్‌ చేశారు.

313
ఈ సందర్భంగా సింగర్‌ దనేష్‌ పాడిన పాటని అభినందించింది. ఆయన `దే దే ప్యార్‌ దే` చిత్రంలోని పాటతో అలరించారు. ఆ పాటని జడ్జ్ లు, సింగర్స్ ఎంజాయ్‌ చేయడంతోపాటు అభినందనలు తెలిపారు.

413
జయప్రద మాత్రం చాలా ఎమోషనల్‌ అయ్యారు. తాను రిషి కపూర్‌ని గుర్తు చేసుకున్నట్టు తెలిపారు. ఆయన పాడిన `డఫ్లీ వాలా` సాంగ్‌ తన మనసుకి దగ్గరైన పాట అని వెల్లడించింది. దనేష్‌ పాడుతున్నప్పుడు రిషి కపూర్‌ని గుర్తు చేశారని తెలిపింది.

513
ఈ పాటని గతంలో రిషికపూర్‌, తనపై చిత్రీకరించారని, ఆ సమయంలో రిషితో ఎంతో మంచి అనుబంధం ఏర్పడిందని తెలిపింది. అంతేకాదు ఈ స్టేజ్‌పై నీతూ కపూర్‌ ఉండి ఉంటే బాగుండేదని చెప్పింది జయప్రద. ఆమె సరైన అర్హురాలు అని పేర్కొంది.

613
అంతేకాదు ఈ షోలో అతిలోక సుందరి శ్రీదేవిని సైతం జయప్రద గుర్తు చేసుకుంది. తమమధ్య ఉన్న గొడవలను ఈ సందర్భంగా వెల్లడించింది.

713
అప్పట్లో బాలీవుడ్‌లో తమ ఇద్దరి మధ్య పోటీ ఉండేదని, ఒకరికొకరు పోటీగా భావించే వాళ్లమని జయప్రద తెలిపింది. ఈ సందర్బంగా జయప్రద.. శ్రీదేవితో తమకి మధ్య జరిగిన ఓ సంఘటనని గుర్తు చేసుకుంది.

813
ఇద్దరం అపట్లో స్టార్టుగా రాణిస్తున్న నేపథ్యంలో తమ మధ్య కాంపిటీటర్‌ అనే ఆలోచన ఉండేది. అది చాలా దూరం తీసుకెళ్లిందని తెలిపింది. దానివల్లే మాట్లాడుకోవడం లేదని తెలిపింది.

913
1984లో వచ్చిన `మక్సాద్‌` చిత్రంలో రాజేష్‌ ఖన్నా, జితేంద్ర హీరోలుగా నటిస్తే, అందులో శ్రీదేవి, జయప్రద హీరోయిన్లు. తమ మధ్య మాటలు లేని విషయాన్ని ఆ ఇద్దరు హీరోలు గుర్తించారట. దీంతో రహస్యంగా ఓ ప్లాన్‌ చేశారని తెలిపింది జయప్రద.

1013
అయితే ఇద్దరి మధ్య ఎలాంటి వ్యక్తిగత శతృత్వం లేదు. కానీ ఎందుకు తామిద్దరికి పడేది కాదట. డ్రెస్‌లో అయినా, డాన్సుల్లో అయినా వీరిద్దరు పోటీగానే భావించేవారట. ఒకరినొకరు కలిసేందుకు అస్సలు ఆసక్తి చూపించే వాళ్లం కాదని చెప్పింది.

1113
ఈ క్రమంలో `మక్సాద్‌` చిత్ర షూటింగ్‌లో శ్రీదేవిని, జయప్రదని ఓ గదిలోకి పంపించి గంటపాటు లాక్‌ చేశారట. ఆ గంట సేపటిలో ఎప్పుడైనా మాట్లాడుకుంటారేమో అని వాళ్లు భావించారు. కానీ వీరిద్దరు గంటసేపు అలా ఉండిపోయారుగానీ ఒకరినొకరు మాట్లాడుకోవడం లేదని తెలిపింది జయప్రద.

1213
దీంతో విసిగిపోయిన వారిద్దరు ఇంకా ఎప్పుడు ప్రయత్నించలేదట. వాళ్లే కాదు ఇంకా ఎవరూ ఆ ప్రయత్నం చేయలేదని తెలిపింది జయప్రద. కానీ అప్పుడు తెలియని తనంతో అలా జరిగిందని, పోటీతత్వంలోనుంచి వచ్చిన భావన తప్ప మరోటి కాదని వెల్లడించింది జయప్రద.

1313
ఈ సందర్భంగా శ్రీదేవిని ఇప్పుడు మిస్‌ కావడం చాలా బాధగా ఉందని తెలిపింది. ఆమె బాగా మిస్‌ అవుతున్నట్టు, అతిలోకసుందరి లేని లోటు కనిపిస్తుందని చెప్పారు. జయప్రద ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సమాజ్‌వాది పార్టీలో చాలా ఏళ్లు పనిచేసిన ఆమె ఇప్పుడు బీజేపీలో ఉంటున్నారు. అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories