అప్పుల్లో ఉన్న అప్‌కమింగ్‌ కొరియోగ్రాఫర్‌కి గణేష్‌ మాస్టర్‌ `మెగా`సాయం.. `ఢీ` యూనిట్‌ మొత్తం టేక్‌ ఏ బౌ

Published : Apr 23, 2021, 10:58 AM IST

పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు ఎక్కువగా కొరియోగ్రఫీ చేసి ఫేమస్‌ అయిన గణేష్‌ మాస్టర్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అప్పుల్లో ఉన్న ఓ యంగ్‌ అప్‌కమింగ్‌ కొరియోగ్రాఫర్‌ అప్పు తీర్చి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. ఢీ టీమ్‌తో క్లాప్స్ కొట్టించుకున్నారు. 

PREV
114
అప్పుల్లో ఉన్న అప్‌కమింగ్‌ కొరియోగ్రాఫర్‌కి గణేష్‌ మాస్టర్‌ `మెగా`సాయం.. `ఢీ` యూనిట్‌ మొత్తం టేక్‌ ఏ బౌ
`ఢీ` షో లేటెస్ట్ ప్రోమో ఇప్పుడు అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తుంది. కానీ అందులో ఓ అప్‌కమింగ్‌ కొరియోగ్రాఫర్‌కి డాన్స్ మాస్టర్‌ గణేష్‌ మాస్టర్‌ చేసిన `మెగా`సాయమే కారణం. ఆ వివరాల్లోకి వెళితే.

214
సాయి అనే కొరియోగ్రాఫర్‌ `ఓ చిట్టి పాప.. `అంటూ సాగే సాంగ్‌ని తన డాన్సర్లతో చేయించారు. ఇద్దరు కుర్రాళ్లు ఈ డాన్స్ చేస్తూ ఇచ్చిన మూవ్‌మెంట్స్, ప్రేమ విఫలంలోని బాధని, వారి సంతోషాలను ప్రతిబింబించిన తీరు అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

314
`ఢీ` జడ్జ్ లో ఒకరైన పూర్ణ ఏకంగా వీరి డాన్స్ చూసి కన్నీళ్లు పెట్టుకుంది. ప్రియమణి అయితే ఏకంగా మీ పర్‌ఫెర్మెన్స్ అదిరిపోయిందంటూ బల్ల గుద్ది మరీ చెప్పింది. వారికి ఫ్లయింగ్‌ కిస్‌ ఇచ్చింది.

414
దీంతో షోలోని అందరు ఒక్కసారిగా ఆనందంతో కేకలు పెటారు. రష్మీ, దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్‌, హైపర్‌ ఆది ఇలా అంతా ఆ డాన్స్‌ ని బాగా ఎంజాయ్‌ చేశారు.

514
ఆ డాన్స్ అయిపోయాక తొటి డాన్సర్‌ ఈ డాన్స్ కంపోజ్‌ చేసిన సాయి అనే కొరియోగ్రాఫర్‌ జీవితాన్ని ఆవిష్కరించారు. తమ ఫ్యామిలీ ఎంతగా ఆర్థిక ఇబ్బందులు పడుతుందో తెలిపారు.

614
సాయికి తండ్రి లేడని, తల్లి ఒక్కతే ఉన్నారని, వారికి అప్పులు బాగానే ఉన్నాయని, రోజూ అప్పుల వాళ్లు వచ్చి అడిగేవారని, వాళ్ల నుంచి తప్పించుకునేందుకు వాళ్లమ్మ ఇంట్లో దాక్కుని వారికి లేరని చెప్పేవారట.

714
ఇలా రోజూ జరిగేదని, భయం భయంగా జీవితాన్ని సాగిస్తున్నారని సాయి వాళ్ల ఫ్యామిలీ దయనీయ పరిస్థితిని వివరించారు. వాళ్లమ్మకి 15వేలు జీతం వస్తుందని, దాంతో ఇళ్లు గడవడమే కష్టంగా ఉందట.

814
ఈ విషయాలు `ఢీ` షోలోని అందరిని కలచివేశాయి. యాంకర్‌ రష్మీ అయితే ఏకంగా కన్నీళ్లే పెట్టుకుంది. బోరున విలపించింది. ప్రియమణి సైతం ఎమోషనల్‌ అయ్యారు.

914
సాయి కష్టాలు, ఇబ్బందులు విన్న గణేష్‌ మాస్టర్‌ మరో ఆలోచన లేకుండా సాయికి బరోసా ఇచ్చాడు. వాళ్లకి ఉన్న నాలుగు లక్షల అప్పు తాను తీరుస్తానంటూ షో అయిపోయాక తనని కలిసి ఆ డబ్బు తీసుకెళ్లు అని చెప్పాడు.

1014
దీంతో `ఢీ` షోలోని యూనిట్‌ మొత్తం కరతాలధ్వనులతో తన ఆనందాన్ని, అభినందనలను గణేష్‌ మాస్టర్‌కి తెలియజేశారు. అందరు టేక్‌ ఏ బౌ అనేలా ఆయనకు ఫిదా అయ్యారు.

1114
అయితే ఈ సందర్భంగా తనకు మీలో పవన్‌ కళ్యాణ్‌ గారు కనిపిస్తున్నారని హైపర్‌ ఆది చెప్పడం, అనంతరం పవన్‌కి ఎన్నో సినిమాలకు డాన్స్ కంపోజ్‌ చేశానని, ఆయన ద్వారా నేర్చుకున్నదానికిది నిదర్శనమని తెలిపి పవన్‌ డాన్స్‌ తో అదరగొట్టారు గణేష్‌ మాస్టర్‌.

1214
తన గురువు పవన్‌ కళ్యాణ్‌ అని ఆయనపై ప్రశంసలు కురిపించారు గణేష్‌ మాస్టర్‌. ఈ సందర్భంగా `గబ్బర్‌సింగ్‌` స్లెప్‌ వేసి అలరించారు.

1314
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ పోస్టర్‌ని ప్రదర్శించి డాన్సర్లు ఆయనకు తమదైన స్టయిల్‌లో ధన్యవాదాలు తెలిపారు.

1414
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరి చేత కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ షో ఈ నెల 28న ప్రసారం కానుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories