భార్యపై పోలీస్ కంప్లైట్ చేసిన జయం రవి

First Published | Sep 25, 2024, 8:47 AM IST

 జయం రవి (Jayam Ravi) పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తమిళ  మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రాపర్టీ విషయంలో అడయార్‌ (చెన్నై) పోలీసులకు 

Jayam Ravi


తమిళ  నటుడు జయం రవి (Jayam Ravi) ఇటీవల విడాకులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి వివాదాలు మొదలయ్యాయి. ఒకరి మీద మరొకరు మండిపడుతున్నారు. మీడియాకు ఎక్కుతున్నారు. ఇదిగో ఇప్పుడు పోలీస్ కేసు పెట్టుకునే దాకా వచ్చింది.  

తన భార్య ఆర్తి (Aarti)పై నటుడు జయం రవి (Jayam Ravi) పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తమిళ  మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రాపర్టీ విషయంలో అడయార్‌ (చెన్నై) పోలీసులకు ఆయన కంప్లయింట్‌ చేసినట్టు సదరు మీడియా పేర్కొంది.

Jayam Ravis


ఆర్తితో విడాకులు తీసుకొన్నట్టు కొన్ని రోజుల క్రితం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇష్టపూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. మరోవైపు, తనకు తెలియకుండానే విడాకుల గురించి ప్రకటించారని ఆర్తి నోట్‌ విడుదల చేయడం గమనార్హం. ఆ తర్వాత ఇప్పుడు జయం రవి ఆమెపై కంప్లైంట్ చేసారు.

ఆ కంప్లైంట్ లో తన భార్య  తనను ఇంటి నుంచి గెంటివేసినట్టు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే,   చెన్నైలోని ఈసీఆర్ రోడ్‌లోని ఆర్తి ఇంటి నుండి తన వస్తువులను తిరిగి ఇవ్వాలని పోలీసు శాఖను అభ్యర్థించినట్లు సమాచారం. 


Jayam Ravi


తనకు తెలియకుండానే, తన ఫర్మిషన్  తీసుకోకుండానే విడాకుల గురించి ఆయన బహిరంగంగా ప్రకటించారని జయం రవి భార్య ఆర్తి కొన్ని రోజుల క్రితం సంచలన ఆరోపణలు చేశారు. ఇదిలాఉండగా.. జయం రవికి ఒక సింగర్‌తో పరిచయమైందని..

ఆమెతో రిలేషన్‌లో ఉన్నారని అందుకే భార్య నుంచి విడాకులు తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలోనే ఆయా వార్తలపై  రీసెంట్ గా  ఆయన స్పందించారు. తన తదుపరి చిత్రం ‘బ్రదర్‌’ (Brother) ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో విడాకుల వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Jayam Ravi


జయం రవి మాట్లాడుతూ... ‘‘మా విడాకుల గురించి ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది మంచి వ్యక్తులు నా సమస్యను అర్థం చేసుకొని నా వ్యక్తిగత జీవితానికి గౌరవం ఇస్తున్నారు. వినయం, మర్యాద లేని వ్యక్తులు ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నారు. నా వద్ద ఆధారాలు ఉన్నాయి.

తప్పకుండా కోర్టులో నిరూపించుకుంటా. నిజం బయటపడిన రోజు.. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వ్యక్తులు తగిన చర్యలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. శ్రమ, స్క్రిప్ట్‌ల ఎంపికతో ఎన్నో ఏళ్ల నుంచి నేను సంపాదించుకున్న పేరు ప్రతిష్టలను నాశనం చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు’’ అన్నారు.


అలాగే ‘‘లాయర్‌ ద్వారా నేను ఆర్తికి విడాకుల నోటీసు పంపించాను. ఈ విషయం ఆమె తండ్రికీ తెలుసు. ఈ విషయం గురించి మా ఇంట్లో ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకున్నారు. నేను అందుబాటులో లేనని, వారికి తెలియకుండానే విడాకులు ప్రకటించానని వాళ్లు ఎలా చెప్పగలుగుతున్నారు? మా పెద్దబ్బాయి అరవ్ పుట్టినరోజు జూన్‌లో జరిగింది.

వాడితో కలిసి సెలబ్రేట్‌ చేసుకోవడం కోసం ఆ సమయంలో నేను చెన్నైలోనే ఉన్నా. దానికి సంబంధించిన ఫొటోలు నా వద్ద ఉన్నాయి. విడాకుల విషయానికి సంబంధించి ఇప్పటికే అరవ్‌తో మాట్లాడాను. ఆర్తి, నేను కలిసి ఉండాలనేదే వాడి ఆలోచన. అయాన్‌ ఇంకా చిన్నవాడే. ఈ విషయాలను అర్థం చేసుకొనే వయసు వాడిది కాదు’’ అని జయం రవి తెలిపారు.

Jayam ravi Statement

 
గాయనితో రిలేషన్‌లో ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు జయం రవి. ‘‘ఈ విషయంలోకి ఆమెను లాగడం మంచిది కాదు. ఆమె నాకు ఎంతో కాలం నుంచి తెలుసు. ఆమె ఒక సైకాలజిస్ట్‌. మానసిక కుంగుబాటు నుంచి బయటపడేందుకు ఎంతోమందికి ఆమె సాయం చేశారు. ఆమెతో కలిసి నేనొక ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఏర్పాటుచేయాలనుకున్నా’’ అని చెప్పారు.

Jayam Ravi


ఏదైమైనా గత కొన్ని నెలలుగా తమిళ చిత్రసీమలో సినిమా ప్రమోషన్ల కంటే నటీనటుల విడాకుల గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. కొన్ని నెలల క్రితం జి.వి. ప్రకాష్-సైంధవి ఇష్యూ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు జయం రవి-ఆర్తి గురించి చాలా మాట్లాడుకున్నారు. జయం రవి విడాకులు ప్రకటించే ముందు, గాయని సుచిత్ర తన యూట్యూబ్ ఛానెల్‌లో జయం రవి-ఆర్తి విడాకుల గురించి మాట్లాడారు. 

Latest Videos

click me!